‘నిజాయితీ వుంటే రీకౌంటింగ్‌కు ఒప్పుకోవాలి’

ABN , First Publish Date - 2022-06-28T23:05:30+05:30 IST

తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు వందల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయాను అని అప్పటి కలెక్టర్ ప్రకటించారని ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్ధి అట్లూరి లక్ష్మణ్ అన్నారు.

‘నిజాయితీ వుంటే రీకౌంటింగ్‌కు ఒప్పుకోవాలి’

కరీంనగర్: తాను గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు వందల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయాను అని అప్పటి కలెక్టర్ ప్రకటించారని  ధర్మపురి కాంగ్రెస్ అభ్యర్ధి అట్లూరి లక్ష్మణ్ అన్నారు. మూడు ఈవీఎంలు కౌంటింగ్ తేడా ఉందని చెప్పినా వినకుండా ప్రకటించారని, తాను రీకౌంటింగ్ చేయాలని కోరానని .. అయినా రీకౌంటింగ్ చెయ్యలేదని గుర్తుచేశారు. తన దగ్గర ఉన్న పూర్తి ఆధారాలను హైకోర్టుకి అందించానని తెలిపారు. రీకౌంటింగ్‌కి కొప్పుల ఈశ్వర్ ఎందుకు ఓప్పుకోవడం లేదన్నారు. హైకోర్ట్ ద్వారా రీకౌంటింగ్‌కి ఆదేశాలు జారీచేస్తారని ఆశిస్తున్నానని పేర్కొన్నారు. కొప్పులకి నిజాయితీ ఉంటే... రికౌంటింగ్‌కి ఒప్పుకోవాలన్నారు. 

Updated Date - 2022-06-28T23:05:30+05:30 IST