పదేళ్ల సడలింపు.. రెండేళ్ల వరకే !: ట్రాన్స్‌కో

ABN , First Publish Date - 2022-05-26T11:51:24+05:30 IST

హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయోపరిమతి సడలింపు అవకాశం రెండేళ్ల వరకే అమలు చేయాలని

పదేళ్ల సడలింపు.. రెండేళ్ల వరకే !: ట్రాన్స్‌కో

హైదరాబాద్‌, మే 25(ఆంధ్రజ్యోతి): ఉద్యోగ నియామకాల్లో పదేళ్ల వయోపరిమతి సడలింపు అవకాశం రెండేళ్ల వరకే అమలు చేయాలని విద్యుత్తు సంస్థలు నిర్ణయించాయి. ఈ సడలింపు ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌(ఓ అండ్‌ ఎం) విభాగాల్లో నియామకాలకు వర్తించదు. అంటే సబ్‌స్టేషన్‌ ఆపరేటర్‌, జూనియర్‌ లైన్‌మెన్‌ ఉద్యోగాలకు వర్తింపచేయరు. దీనికి అనుగుణంగా ఇటీవల పాలకమండలి సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బుధవారం ట్రాన్స్‌కో సీఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావు ఉత్తర్వులిచ్చారు.    పదేళ్ల సడలింపు నిబంధన 2024 మార్చి 18వ దాకా అమల్లో ఉండనుంది. 

Updated Date - 2022-05-26T11:51:24+05:30 IST