ఈ నెల 28న ఇంటర్ ఫలితాలు: సబిత

ABN , First Publish Date - 2022-06-27T02:50:19+05:30 IST

ఈ నెల 28న ఇంటర్ ఫలితాలు: సబిత

ఈ నెల 28న ఇంటర్ ఫలితాలు: సబిత

హైదరాబాద్: తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు విడుద‌ల తేదీ ఖరారు చేశారు. ఈ నెల 28వ తేదీన ఉద‌యం 11 గంట‌ల‌కు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి విడుద‌ల చేయ‌నున్నారు. ఇంట‌ర్ ప్ర‌థ‌మ‌, ద్వితీయ సంవ‌త్స‌రం ఫ‌లితాల‌ను ఒకేసారి విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డు ప్ర‌క‌టించింది. మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెలిసిందే. ఈ ఏడాది ఇంటర్‌ ఫస్టియర్‌, సెకండియర్‌తో కలిపి మొత్తం 9,07,393 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు.  

Updated Date - 2022-06-27T02:50:19+05:30 IST