వనస్థలిపురం పీఎస్ పరిధిలో మందుబాబుల వీరంగం

ABN , First Publish Date - 2022-04-26T20:51:56+05:30 IST

వనస్థలిపురం పీఎస్ పరిధిలో మందుబాబుల వీరంగం

వనస్థలిపురం పీఎస్ పరిధిలో మందుబాబుల వీరంగం

హైదరాబాద్: వనస్థలిపురం పీఎస్ పరిధిలో మందుబాబుల వీరంగం సృష్టించారు. కిన్నర గ్రాండ్ బార్ అండ్ రెస్టారెంట్‌లో యువకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మద్యం మత్తులో బీర్ బాటిల్స్‌తో యువకులు పరస్పరం కొట్టుకున్నారు. ఈ దాడిలో పలువురు యువకులకు గాయాలయ్యాయి. గాయపడ్డ యువకులను ఆస్పత్రికి తరలించారు. జరిగిన ఈ ఘటనపై కిన్నర గ్రాండ్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు. 

Updated Date - 2022-04-26T20:51:56+05:30 IST