TS News: అర్థరాత్రి వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు..

ABN , First Publish Date - 2022-08-16T20:20:34+05:30 IST

ఎంపీపీ ని పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించడం అర్ధరాత్రి కలకలం రేపింది.

TS News: అర్థరాత్రి వెంకట్ రెడ్డిని అరెస్ట్ చేసేందుకు వచ్చిన పోలీసులు..

హైదరాబాద్ (Hyderabad): చౌటుప్పల్ ఎంపీపీ (MPP) తాడూరి వెంకట్ రెడ్డి (Venkat Reddy)ని పోలీసులు అరెస్ట్ (Arrest) చేసేందుకు ప్రయత్నించడం అర్ధరాత్రి కలకలం రేపింది. మునుగోడు ఉప ఎన్నిక (By Election)తో అధికార టీఆర్ఎస్ (TRS) పార్టీలో మరోసారి గందరగోళం నెలకొంది. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (Prabhakar Reddy)కి వ్యతిరేకంగా గళం విప్పడంతో పోలీసులు అర్థరాత్రి అరెస్టులకు తెరలేపారు. ఇదే క్రమంలో హైదరాబాద్, వనస్థలిపురం, తంగిరిళ్ళ అపార్టుమెంట్లో నివాసం ఉంటున్న చౌటుప్పల్ టీఆర్ఎస్ ఎంపీపీ తాడూరు వెంకట్ రెడ్డి ఇంటిని ఎస్వోటీ (SOT), సీసీఎస్ (CCS) పోలీసులు చుట్టుముట్టారు. అరెస్టు చేసేందుకు యత్నించారు. 


టీఆర్ఎస్ ఎంపీపీగా ఉన్న వెంకట్ రెడ్డి.. మంత్రి జగదీష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్లకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. తనతోపాటు కొంతమంది జడ్పీటీసీలు, సర్పంచ్‌లతో కలిసి సమావేశం ఏర్పాటు చేసుకుని బీజేపీలోకి వెళ్లడానికి సంప్రదింపులు చేస్తున్నారు. ఈ తరుణంలో తనపై అక్రమకేసు బనాయించి, బెదిరింపులకు పాల్పడుతున్నారని, ఇదంతా మంత్రి జగదీష్ రెడ్డి కుట్ర అని వెంకట్ రెడ్డి ఆరోపించారు.


అర్థరాత్రి 11, 12 గంటల ప్రాంతంలో వాచ్‌మెన్‌ను తీసుకు వచ్చిన పోలీసులు దాక్కొని తనను బయటకు రప్పించాలని ప్రయత్నించారని వెంకట్ రెడ్డి అన్నారు. నోటీసు ఇచ్చేందుకు వచ్చామని ఒకసారి, అరెస్టు చేసేందుకు వచ్చామని మరోసారి చెప్పారన్నారు. ఈ సమయంలో రావడం ఏంటని ప్రశ్నిస్తే ఎప్పుడు రావాలో చెప్పి రావాలా? అని నిర్లక్ష్యంగా పోలీసులు సమాధానం ఇచ్చారని తెలిపారు. ఇదంతా మంత్రి జగదీష్ రెడ్డి కుట్ర అని, ఇలాంటి బెదిరింపులకు భయపడేది లేదని వెంకట్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు తాడూరు వెంకట్ రెడ్డి ఇంటికి పెద్ద సంఖ్యలో చేరుకుని.. ఆయన్ను పరామర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం, పోలీసుల తీరును వారు తీవ్రంగా ఖండించారు. 

Updated Date - 2022-08-16T20:20:34+05:30 IST