Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Thu, 22 Sep 2022 13:33:43 IST

Minister Srinivas goud: ఉప్పల్‌ స్టేడియం ఉన్నది తెలంగాణలోనే.. గుర్తుపెట్టుకోండి

twitter-iconwatsapp-iconfb-icon
Minister Srinivas goud: ఉప్పల్‌ స్టేడియం ఉన్నది తెలంగాణలోనే.. గుర్తుపెట్టుకోండి

హైదరాబాద్: హెచ్‌సీఏ (HCA)పై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ (Srinivas goud) ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ... టిక్కెట్ల అమ్మకాల విషయంలో పారదర్శకంగా ఉండాలని... ఇష్టానుసారం ఉంటామంటే కుదరదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం (Telangana government)తో సంబంధం లేన్నట్లు వ్యవహరిస్తే ఊరుకోమని హెచ్చరించారు. ఉప్పల్‌ స్టేడియం ఉన్నది తెలంగాణలోనే.. గుర్తుపెట్టుకోండి అని అన్నారు. టిక్కెట్ల విషయంలో అవకతవకలకు పాల్పడితే ఊరుకునేది లేదని శ్రీనివాస్ గౌడ్ (Telangana minister) స్పష్టం చేశారు. 


హెచ్‌సీఏపై పోలీసుల ఆగ్రహం...

టిక్కెట్ల విషయంలో హెచ్‌సీఏ వైఖరి పట్ల పోలీసులు కూడా మండిపడ్డారు. హెచ్‌సీఏపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. తోపులాటకు హెచ్‌సీఏ వైఖరే కారణమని పోలీసులు చెబుతున్నారు. 


కాగా... భారత్ - ఆస్ట్రేలియా మ్యాచ్ టికెట్ల కోసం జింఖానా గ్రౌండ్స్‌కు అభిమానులు ఎగబడ్డారు. పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో పలువురు అభిమానులతో పాటు, పోలీసులు కూడా గాయపడ్డారు. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో అభిమానులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మూడు వేల టికెట్లకు 30వేలకు పైగా అభిమానులు తరలివచ్చారు. తొక్కిసలాట జరడంతో హెచ్‌సీఏ టిక్కెట్ కౌంటర్లను మూసివేసింది. 


Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.