ఆ పదవులకు రాజీనామా చేస్తా: కేటీఆర్

ABN , First Publish Date - 2022-01-12T03:31:38+05:30 IST

రాజకీయ నాయకులకు క్రీడల పదవులే ఉండొద్దని, తాను కూడా క్రీడల పదవులకు రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. క్రీడారంగంపై..

ఆ పదవులకు రాజీనామా చేస్తా: కేటీఆర్

హైదరాబాద్‌: రాజకీయ నాయకులకు క్రీడల పదవులే ఉండొద్దని, తాను కూడా క్రీడల పదవులకు రాజీనామా చేస్తానని మంత్రి కేటీఆర్‌ అన్నారు. క్రీడారంగంపై మంత్రుల సబ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రైవేటు రంగంలో స్పోర్ట్స్ యూనివర్శిటీలను ప్రోత్సహిద్దామన్నారు. పిల్లలను కోళ్ల ఫారాలలో కోళ్ల లాగా కుక్కుతున్నారని, హైదరాబాద్‌లో దాదాపు స్కూళ్లకు ప్లే గ్రౌండ్స్ లేవన్నారు. పని, చదువే కాదని, ఆటలు, ఫిజికల్ ఫిట్‌నెస్ కూడా అవసరమని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో లైఫ్ స్టైల్ మారిందని, హాకీ, క్రికెట్ వంటి క్రీడల మీద దృష్టి పెట్టాలని, ఒక మోడల్ తయారు చేయాలని ఈ సందర్భంగా అధికారులను కేటీఆర్ ఆదేశించారు. 

Updated Date - 2022-01-12T03:31:38+05:30 IST