వీరస్వామి (ఫైల్ ఫొటో)
హుజూర్‌నగర్ , మే 18: తెలంగాణ మలిదశ ఉద్య మకారుడు, టీఆర్‌ఎస్ నాయకుడు గార్లపాటి వీరస్వామి(58) బుధవారం తెల్లవారుజామున గుండెపోటు తో మృతిచెందారు. ఆయనకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో. జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన అనేక ఉద్యమాల్లో క్రియాశీలక పాత్ర పోషించారు. వీరస్వామి మృత దేహానికి వక్కంతుల కోటేశ్వరరావు, మేకల నాగేశ్వరరావు, వేములూరి రంగాచారి, అమర్‌నాథ్‌రెడ్డి, గూడెపు శ్రీనివాస్, ఫణికుమారి, నాగారపు పాండు, బ్రహ్మం, మురళి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించి కుటుంబ సభ్యులకు సంతాపం తెలిపారు.