ప్రతి ఒక్కరు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలి: సునీతాలక్ష్మారెడ్డి

ABN , First Publish Date - 2022-07-17T00:36:25+05:30 IST

ఆడ మగ అంటూ బేధాభిప్రాయంతో పిల్లలను పెంచకూడదని సమాన హక్కు కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి మీద ఉందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు.

ప్రతి ఒక్కరు మహిళల అభ్యున్నతి కోసం కృషి చేయాలి: సునీతాలక్ష్మారెడ్డి

హైదరాబాద్: ఆడ మగ అంటూ బేధాభిప్రాయంతో పిల్లలను పెంచకూడదని సమాన హక్కు కల్పిస్తూ పెంచాల్సిన బాధ్యత ప్రతిఒక్కరి మీద ఉందని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. హైదరాబాద్ హెచ్ఐసీసీ లో ఫాగ్సి చైర్ పర్సన్ శాంతా కుమారి అధ్యక్షతన జరిగిన అబ్‌స్టెట్రిక్స్‌ అండ్‌ గైనకాలజీ నవీకరణలపై గ్లోబల్ కాన్ఫరెన్స్ ను సునీతా లక్ష్మారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గర్భిణీలు, బాలింతలు, శిశువులకు సరైన పోషకాహారం అందజేసి పోషకాహార లోపాన్ని సంపూర్ణంగా నిర్మూలించడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఆరోగ్య లక్ష్మి పథకం అమలు చేస్తోందని అన్నారు. వైద్య ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు బాధ్యతలు స్వీకరించాక ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు పెరిగాయని, కేసీఆర్ కిట్స్ పంపిణీ, ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులు కల్పించడంలో ప్రత్యేక చర్యలు చేపట్టారని గుర్తుచేశారు. 


ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి సమాన హక్కులు కల్పిస్తోందన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎక్కడ లేని విధంగా రాష్ట్రంలో మహిళల రక్షణ కోసం షి టీమ్స్, భరోసా సెంటర్స్, సఖి సెంటర్స్ ఏర్పాటు చేసిందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని చైర్ పర్సన్ గుర్తుచేశారు. కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ వైస్ ఛాన్సలర్ డా.బి. కరుణాకర్ రెడ్డి, మహిళా కమిషన్ సెక్రెటరీ కృష్ణ కుమారి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-17T00:36:25+05:30 IST