దేవుడు మనకిచ్చిన గొప్పవరం అమ్మ:sunita laxma reddy

ABN , First Publish Date - 2022-05-09T23:39:19+05:30 IST

దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి(sunita laxma reddy) అన్నారు.

దేవుడు మనకిచ్చిన గొప్పవరం అమ్మ:sunita laxma reddy

హైదరాబాద్: దేవుడు అన్ని చోట్లా ఉండలేక అమ్మని సృష్టించాడని తెలంగాణ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునీత లక్ష్మారెడ్డి(sunita laxma reddy) అన్నారు. అమ్మలందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ మాతృ దినోత్సవం పురస్కరించుకొని సోమవారం గ్రీన్ పార్క్ హోటల్ లో సోనమ్ మిట్టల్ మహిళ సంక్షేమ చారిటబుల్ ట్రస్ట్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని వివిధ రంగాల్లో రాణిస్తున్న మహిళలు, బాలికలకు అవార్డులు మరియు నగదు బహుమతులను అందజేశారు. ప్రస్తుత సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో ముందున్నారని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడ్డాక మహిళలను ప్రత్యేకంగా గౌరవిస్తూ వారికి సమాన హక్కులు కల్పిస్తోందన్నారు. 


తెలంగాణ ప్రభుత్వం ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళల కోసం షి టీమ్స్, భరోసా సెంటర్స్, సఖి సెంటర్స్, వీ-హబ్ ఏర్పాటు చేసిందని.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్(kcr) మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని చైర్ పర్సన్ గుర్తుచేశారు. కమిషన్ మహిళలకు రక్షణ హక్కులపై అవగాహన కల్పించడంతో పాటు మహిళలకు అండగా నిలుస్తుందన్నారు. మహిళలు ఏ సమస్య వచ్చినా అధైర్యపడకుండ దృఢంగా ఉండాలని, ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుందని అన్నారు. టెక్నాలజీ పరంగా సమాజం ఇంత ముందుకు వెళ్తున్నా ఇంకా మహిళలపై దాడులు జరగడం చాలా బాధాకరం అని చైర్ పర్సన్ అన్నారు. 


అనంతరం రాష్ట్ర మహిళా కమిషన్ మహిళల రక్షణకై చేస్తున్న కార్యక్రమాల్ని చైర్ పర్సన్ వివరించారు. మహిళలకు ఏ సమస్యా వచ్చిన తక్షణమే మహిళ కమీషన్ దృష్టికి తీసుకురావాలని చైర్ పర్సన్ కోరారు. అలాగే ఇంట్లో సమస్యలతో కమిషన్ కి రాలేకపోయే వారికీ సోషల్ మీడియా ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చని గుర్తు చేసారు. మీరు ఫేస్ బుక్, ట్విట్టర్, ఇంస్టాగ్రామ్ @SCWTelangana ద్వారా, ఈమెయిల్ telanganastatewomenscommission@gmail.com, హెల్ప్ లైన్ 181 లేదా కమిషన్ వాట్సప్ నంబర్ 9490555533 ద్వారా కూడా మహిళలకు జరిగే అన్యాయాన్ని కమిషన్ దృష్టికి తీసుకురావచ్చని చెప్పారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ సెక్రెటరీ కృష్ణ కుమారి, ఎఫ్.ఐ.సి.సి.ఐ చైర్ పర్సన్ శుభ్ర మహేశ్వరి మరియు తదితరులు పాల్గొన్నారు.

Read more