స్త్రీల హక్కుల కోసం కృషిచేసిన మహనీయుడు అంబేద్కర్

ABN , First Publish Date - 2022-04-15T00:32:38+05:30 IST

మహిళా సాధికారత కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఎంతో కృషి చేశారని తెలంగాణ మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునిత లక్ష్మారెడ్డి అన్నారు.

స్త్రీల హక్కుల కోసం కృషిచేసిన మహనీయుడు అంబేద్కర్

హైదరాబాద్: మహిళా సాధికారత కోసం డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఎంతో కృషి చేశారని తెలంగాణ మహిళ కమిషన్ చైర్ పర్సన్ వాకిటి సునిత లక్ష్మారెడ్డి అన్నారు. రాజ్యాంగ నిర్మాత, భారత రత్న, డాక్టర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 131వ జయంతి సందర్భంగా నర్సాపూర్ నియోజకవర్గంలో జరిగిన అంబేద్కర్ జయంతి వేడుకల్లో వాకిటి సునిత లక్ష్మారెడ్డి పాల్గొని ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. మహిళల హక్కులు, వారి సాధికారత, బాల్య వివాహాలు, కులాంతర, మతాంతర వివాహాలు, వితంతు పునర్‌ వివాహాలు, మహిళలకు ఆస్తి హక్కు, స్త్రీ విద్య కోసం డాక్టర్‌. బీ.ఆర్‌. అంబేద్కర్‌ చేసిన కృషి మరువలేనిదన్నారు.


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమల్లోకి తెచ్చారని ఆమె గుర్తుచేశారు. డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళే బాధ్యత మనందరి పై ఉందని, సమాజం లో మార్పు రావాలి, సమానత్వం రావాలని ఆయన చూపిన బాటలోనే మనమందరం నడవాలని ఆమె పిలుపునిచ్చారు.

Updated Date - 2022-04-15T00:32:38+05:30 IST