తెలంగాణకు తాళం.. మరి ఏపీ?

ABN , First Publish Date - 2021-05-12T01:00:32+05:30 IST

తెలంగాణకు తాళం.. మరి ఏపీ?

తెలంగాణకు తాళం.. మరి ఏపీ?

హైదరాబాద్: లాక్‌డౌన్‌పై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బుధవారం నుంచి పది రోజుల పాటు రాష్ట్రంలో లాక్‌డౌన్ విధించనున్నట్టు ప్రకటించింది. ఈ పదిరోజుల పాటు ఉదయం 10 గంటల నుంచి లాక్ డౌన్ అమలు చేయాలని క్యాబినెట్ నిర్ణయించింది. ప్రతిరోజూ ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు అన్నీ కార్యకలాపాలకు అవకాశమిచ్చారు. పది తర్వాత మరుసటి రోజు ఉదయం ఆరు గంటల వరకు జన సంచారంపై కఠిన నియంత్రణలు ఉంటాయి. 


మరోవైపు లాక్‌డౌన్ మార్గదర్శకాలను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించిన పనులు, అనుబంధ రంగాలు, వ్యవసాయ యంత్రాల పనులు, రైస్ మిల్లుల నిర్వహణ, సంబంధిత రవాణా, ఎఫ్.సి.ఐ.కి ధాన్యం పంపడం, ఫెర్టిలైజర్, సీడ్ షాపులు, విత్తన తయారీ కర్మాగారాలు తదితర అన్నిరకాల వ్యవసాయ రంగాలకు లాక్ డౌన్ వర్తించదని మార్గదర్శకాల్లో పేర్కొంది. రైతుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం కొనుగోళ్లను యథావిధిగా కొనసాగించాలని క్యాబినెట్ నిర్ణయించింది. 


ఇదిలా ఉంటే ఏపీలో లాక్‌డౌన్ ప్రకటించలేదు. కర్ఫ్యూ కొనసాగుతోంది. మధ్యాహ్నం నుంచి మరుసటి రోజు ఉదయం వరకు కర్ఫ్యూ అమలవుతోంది. మరోవైపు ఏపీలో కూడా లాక్‌డౌన్ విధించాలని ప్రతిపక్ష నేతలతో పాటు పలు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. 


ఈ నేపథ్యంలో ‘‘తెలంగాణలో లాక్‌డౌన్ విధించక తప్పని పరిస్థితి ఏర్పడిందా?. పరిస్థితి చేయిదాటక ముందు తెలంగాణ ప్రభుత్వం జాగ్రత్త పడిందా?. లాక్‌డౌన్ టైంలో ప్రభుత్వం ఏం చేస్తుంది?. ప్రజలేం చేయాలి?. తెలంగాణ కంటే తీవ్రత ఎక్కువగా ఉన్న ఏపీలో కూడా లాక్‌డౌన్ తప్పదా?. జగన్ ప్రభుత్వం కూడా లాక్‌డౌన్ ప్రకటించే అవకాశం ఉందా?. లాక్‌డౌన్ నిర్ణయంపై విమర్శించే వారి వాదనలో పస ఉందా?.’’ అనే అంశాలపై ఏబీఎన్ అంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 




Updated Date - 2021-05-12T01:00:32+05:30 IST