తెలంగాణలోని కొన్ని రైస్ మిల్లుల్లో అవకతవకలు: కిషన్‌రెడ్డి

ABN , First Publish Date - 2022-04-20T22:03:34+05:30 IST

తెలంగాణలోని కొన్ని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ

తెలంగాణలోని కొన్ని రైస్ మిల్లుల్లో అవకతవకలు: కిషన్‌రెడ్డి

హైదరాబాద్: తెలంగాణలోని కొన్ని రైస్ మిల్లుల్లో అవకతవకలు జరుగుతున్నాయని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొన్ని రైస్ మిల్లుల్లో ఉండాల్సిన ధాన్యం లేదన్నారు. ఎఫ్‌సీఐ దాడుల్లో 4,53,890 సంచుల ధాన్యం తక్కువ ఉందని, అవి ఎక్కడికి పోయాయో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చెప్పాలని ప్రశ్నించారు. తక్కువైన ధాన్యంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రమత్తం చేశామన్నారు. ‘‘అన్ని రైస్ మిల్లులలో తనిఖీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశాం. రైస్ మిల్లులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో త్వరలో లేఖ రాస్తాం. ధాన్యం కొనాలని సివిల్ సప్లై కార్యదర్శి కేంద్రానికి లేఖ రాశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనను కేంద్రం ఆమోదించింది. రైతుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ధాన్యం కొనలేదు‘‘ అని కిషన్‌రెడ్డి విమర్శించారు.

Updated Date - 2022-04-20T22:03:34+05:30 IST