అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ

ABN , First Publish Date - 2020-06-03T09:27:33+05:30 IST

ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, అనతికాలంలోనే సమర్థవంత మైన,

అమరుల త్యాగ ఫలితమే తెలంగాణ

మంత్రి చామకూర మల్లారెడ్డి 


(ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి):
ఎందరో అమరవీరుల త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, అనతికాలంలోనే సమర్థవంత మైన, నాయకత్వంలో రాష్ట్రం అన్నిరంగాల్లో అగ్రగా మిగా నిలిచిందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి తెలిపారు. మంగళవారం మేడ్చల్‌ మల్కాజ్‌గిరిజిల్లా కలెక్టరేట్‌లో జరిగిన తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు ఆర్భాటాలు లేకుండా జరిగాయి. ఉదయం 8.30గంటలకు కీసరలోని అమరవీరుల స్థూపం వద్ద మంత్రి నివాళులర్పిం చారు. అనంతరం కలెక్టరేట్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి పోలీసుల నుంచి గౌరవవందనం స్వీక రించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందన్నారు.


వైరస్‌ కట్టడికి జిల్లా యంత్రాంగం పటిష్టమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. వైద్యశాఖతోపాటు పారిశుధ్య కార్మికులు, పోలీస్‌, రెవెన్యూ శాఖలు విశిష్ట సేవలందిస్తున్నాయని తెలి పారు. లాక్‌డౌన్‌ కారణంగా మేడ్చల్‌జిల్లాలో 4.95 లక్షల ఆహార భద్రతకార్డులు ఉన్నవారికి పేదలకు ఒక్కొక్కరికీ 12కిలోల చొప్పున బియ్యం, కుటుం బానికి రూ.1500 చొప్పున అందించామని తెలిపారు. జిల్లాలో ఉన్న 90,449మంది వలస కూలీలకు ఒక్కొక్కరికి 12కిలోల చొప్పున బియ్యం, రూ. 500 చొప్పున రూ.4.52లక్షలను అందించినట్టు వెల్ల డించారు. శ్రామిక్‌ రైళ్లల్లో 1.50లక్షల మంది వలస కార్మికులను సొంత రాష్ర్టాలకు పంపించామన్నారు.


నియంత్రిత సాగు విధానం అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు వెల్లడించారు. రైతు బంధు పథకం కింద 42,278 మంది రైతుల ఖా తాల్లో దాదాపు రూ.39.03కోట్లు జమ చేశామన్నారు. రైతుబీమా పథకం కింద 49మందికి ఒక్కొక్కరికి రూ.5లక్షల చొప్పున రూ.2.45కోట్లను నామినీ ఖా తాలో జమ చేశామని వెల్లడించారు. రబీ సీజన్‌లో 10 ధాన్యం కేంద్రాలు ఏర్పాటు చేసి, 3,948 మంది రైతుల నుంచి 16,268 టన్నుల వరి ధాన్యం కొను గోలు చేశామని తెలిపారు. పేద ప్రజల కోసం నూతనంగా 15బస్తీ దవాఖానాలు ప్రారంభించామ న్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, జిల్లా కలె క్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-06-03T09:27:33+05:30 IST