దేశానికే తెలంగాణ ఆదర్శం

ABN , First Publish Date - 2022-08-16T06:29:56+05:30 IST

దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రం గా తెలంగాణ గుర్తింపును సాధించిందని, అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగా మిగా జగిత్యాలను నిలపడానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర షె డ్యూల్‌ కులాల అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్దుల సంక్షేమ శాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు.

దేశానికే తెలంగాణ ఆదర్శం
మాట్లాడుతున్న మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగామిగా జగిత్యాల

- రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌

- జగిత్యాలలో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు

జగిత్యాల, ఆగస్టు 15 (ఆంధ్రజ్యోతి): దేశంలోనే ఆదర్శవంతమైన రాష్ట్రం గా తెలంగాణ గుర్తింపును సాధించిందని, అభివృద్ధి, సంక్షేమంలో అగ్రగా మిగా జగిత్యాలను నిలపడానికి నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర షె డ్యూల్‌ కులాల అభివృద్ధి, మైనార్టీ, దివ్యాంగుల, వృద్దుల సంక్షేమ శాఖ మం త్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. సోమవారం పట్టణంలోని ఖిల్లా గడ్డలో జరి గిన స్వాతంత్య్ర వేడుకల్లో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ దావ వసంత, కలెక్టర్‌ రవి, ఎస్పీ సింధుశర్మతో కలిసి పాల్గొన్నారు. అనంతరం మంత్రి ఈశ్వర్‌ జాతీయ పతాకావిష్కరణ జరి పా రు. పోలీస్‌ పరేడ్‌ వందన స్వీకారం, స్వాతంత్య్ర సమరయోధులకు సత్కా రం నిర్వహించారు. తదుపరి పాఠశాల, కళాశాలల విద్యార్థులు, యువజన, మహిళా సంఘాల సభ్యులచే సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన, వివిధ రంగాల్లో కృషి చేసిన వ్యక్తులకు ప్రశంసా పత్రాల పంపిణీ, స్టాల్స్‌ పరిశీల న, లబ్ధిదారులకు ఆస్తుల పంపిణీ, వందన సమర్పణ తదితర కార్యక్రమా లను నిర్వహించారు. ఈ సందర్బంగా మంత్రి ప్రజలనుద్ధేశించి ప్రసంగిం చారు. రాష్ట్రంలోనే జగిత్యాల జిల్లాను ఆదర్శవంతంగా నిలుపుతున్నామన్నా రు. దేశ సమగ్రత ప్రతిబింబిచేలా జిల్లాలో ఇంటింటా జాతీయ పతా కాల ను ఎగురవేశారన్నారు. మహాత్ముడి జీవితాన్ని నేటి తరం బాలలకు తెలి పేందుకు జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో గాంధీ చిత్రాన్ని ఉచితంగా చూపిస్తున్నామన్నారు. వజ్రోత్సవాల్లో భాగంగా ఫ్రీడం రన్‌, ఫ్రీడం ర్యాలీ, సాంస్కృతిక కార్యక్రమాలు, కవి సమ్మేళనాలు, మొక్కలు నాటడం, సమూ హిక జాతీయ గీతాలాపాన, క్రీడాపోటీలు, రంగోలి, రక్తదాన శిభిరాలను ని ర్వహించామన్నారు. జిల్లాలో రైతు బంధు పథకం కింద 9 విడతలలో 2.15 లక్షల మంది రైతులకు రూ. 1,667 కోట్ల సహాయాన్ని అందించామన్నారు. మన ఊరు మన బడి కార్యక్రమం కింద జిల్లాలో 274 పాఠశాలలను ఎం పిక చేసి మొదటి విడత కింద 61 పాఠశాలలో 131 కొత్త తరగతి గదులు, 32 పాఠశాలలో ప్రహరి గోడల నిర్మాణం జరపుతున్నామన్నారు. వచ్చే వి ద్యా సంవత్సరం నుంచి జిల్లాలో ఒకటవ తరగతి నుంచి 8వ తరగతి వర కు ఇంగ్లీష్‌ మీడియం విద్యాబోధన జరుపడానికి అనుగుణంగా 1,725 మం ది ఉపాధ్యాయులకు శిక్షణను అందించామన్నారు. రానున్న విద్యాసంవత్స రం నుంచి జగిత్యాల మెడికల్‌ కళాశాలలో ప్రవేశాలు ప్రారం భించనున్నా మన్నారు. జిల్లాలో కాళేశ్వరం లింక్‌ 2 అదనపు టీఎంసీ తరలింపు నిర్మాణ పనులు అక్టోబర్‌ చివరి నాటికి పూర్తి చేయనున్నామని తెలిపారు. దళిత బంధు పథకం కింద జిల్లాలో నియోజకవర్గానికి వంద మంది చొప్పున రూ. 10 లక్షల సహాయాన్ని అందించామన్నారు. జిల్లాలో ఆసరా పథకం కింద ప్రతీ నెల రూ. 42.44 కోట్ల ఫించన్‌ను 2.02 లక్షల మందికి అందిస్తున్నా మన్నారు. ఉపాధి హామీ పథకం కింద జిల్లాలో ఇప్పటివరకు 1,81,150 జా బ్‌ కార్డుల ద్వారా 20.60 లక్షల పనిదినాలు కల్పించామన్నారు. పట్టణ ప్రగ తి కార్యక్రమం కింద మున్సిపాల్టీలకు రూ. 53.16 కోట్లు మంజూరు చే శామని తెలిపారు. జిల్లాలోని జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురిలలో ఇంటిగ్రేటెడ్‌ మార్కెట్‌ అభివృద్ధి పనులు వేగవంతంగా జరుగుతున్నాయ న్నారు. హరితహారంలో భాగంగా జిల్లాలో 8 లక్షల మొక్కలు నాటాలన్న లక్ష్యానికి గానూ ఇప్పటివరకు 5,57,722 మొక్కలు నాటామన్నారు.  జిల్లా లో రూ. 228 కోట్లతో 17,450 గొర్రెల యూనిట్లను 75 శాతం సబ్సిడీపై పం పిణీ చేశామన్నారు. జిల్లాలో రూ. 497.77 కోట్ల నిధులతో 8,525 రెండు ప డక గదుల ఇళ్లను నిర్మించి లబ్ధిదారులకు పంపిణీ చేశామని తెలిపారు. ప్ర స్తుతం 336 గృహాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయన్నారు. జిల్లాలో సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 12 బాలుర, 7 బాలికల వసతి గృహాలలో 678 మంది విద్యార్థినీ విద్యార్థులకు వసతి కల్పించామన్నారు. ఈ కార్యక్ర మంలో జిల్లా గ్రంథాలయ కమిటీ చైర్మన్‌ చంద్రశేఖర్‌ గౌడ్‌, డీసీఎంఎస్‌ చైర్మన్‌ ఎలాల శ్రీకాంత్‌రెడ్డి, అదనపు కలెక్టర్లు బీఎస్‌ లత, అరుణశ్రీ, ఆర్‌ డీవోలు వినోద్‌ కుమార్‌, మాదురి, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారు లు, స్వచ్చంద సంస్థల సభ్యులు పాల్గొన్నారు.

జాతీయ జెండాను ఆవిష్కరించిన కలెక్టర్‌ 

పట్టణంలోని కలెక్టరేట్‌ కార్యాలయంలో, క్యాంపు కార్యాలయాల్లో జిల్లా క లెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ సోమవారం జాతీయ జెండాను ఆవిష్క రిం చారు. అనంతరం మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివా ళులు అర్పించారు. జాతీయ గీతాలాపాన చేసిన పాఠశాల విద్యార్థులకు బహుమతులను అందించారు. పట్టణంలోని అదనపు కలెక్టర్‌ క్యాంపు కా ర్యాలయంలో అదనపు కలెక్టర్‌ బీఎస్‌ లత జాతీయ పతాకాన్ని ఆవిష్క రించారు. జాతీయ గీతాలాపాన చేసి వందన సమర్పణ జరిపారు. ఈ కా ర్యక్రమంలో పలువురు కలెక్టర్‌ కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.

 ఆకట్టుకున్న సాంస్కృతిక ప్రదర్శనలు

ఖిల్లాలో సోమవారం పలు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. పలు దేశభక్తి, ఆధ్యా త్మిక, జానపద, సినీ గేయాలపై విద్యార్థులు ప్రదర్శనలు ఇచ్చారు. ప్రతిభ కనబరిచిన విద్యార్థులను మంత్రి కొప్పుల ఈశ్వర్‌, ఎమ్మెల్యే డాక్టర్‌ సంజయ్‌ కుమార్‌, కలెక్టర్‌ గుగులోతు రవి నాయక్‌ అభినందించారు.


Updated Date - 2022-08-16T06:29:56+05:30 IST