తెలంగాణ ఒక ఆధ్యాత్మిక క్షేత్రం

ABN , First Publish Date - 2022-08-11T06:06:34+05:30 IST

‘‘నేను దుబ్బాకకు రావాలి.. దుబ్బాకలో తీర్చబడిన వేంకటేశ్వరాలయాన్ని సందర్శించి, దుబ్బాకలో చదువుకున్న పాఠశాలను ప్రారంభించాలి.’’

తెలంగాణ ఒక ఆధ్యాత్మిక క్షేత్రం

త్వరలోనే దుబ్బాకకు ముఖ్యమంత్రి కేసీఆర్‌

తాను చదువుకున్న బడిని ప్రారంభించనున్న సీఎం

దుబ్బాక బాలాజీ ఆలయం పర్యాటక క్షేత్రంగా వెలగాలి

రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు


దుబ్బాక, ఆగస్టు10: ‘‘నేను దుబ్బాకకు రావాలి.. దుబ్బాకలో తీర్చబడిన వేంకటేశ్వరాలయాన్ని సందర్శించి, దుబ్బాకలో చదువుకున్న పాఠశాలను ప్రారంభించాలి.’’ అని సీఎం కేసీఆర్‌ తాపత్రయంగా ఉన్నారని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. దుబ్బాకలో కేసీఆర్‌ బడి పనులు పూర్తయ్యాయని, ప్రారంభానికి రావాలని సీఎంను ఎంపీ ప్రభాకర్‌రెడ్డి కోరగా అందుకు ఆయన బాలాజీ వేంకటేశ్వరాలయానికి కూడా రావాలని ఉందనే ఆకాంక్షను వెల్లడించారని హరీశ్‌రావు తెలిపారు. బుధవారం దుబ్బాకలోని బాలాజీ వేంకటేశ్వరాలయ వార్షికోత్సవంలో ఎంపీ ప్రభాకర్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ఇప్పుడు ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా తీర్చబడుతుందన్నారు. దుబ్బాకలో బాలాజీ వేంకటేశ్వరాలయ నిర్మాణానికి కేసీఆర్‌ ఎంతో కృషి చేశారని గుర్తుచేశారు. త్వరలోనే సీఎం కేసీఆర్‌ దుబ్బాకలో పర్యటిస్తారని మంత్రి వెల్లడించారు. ఆయనకు ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతంపలికారు. అనంతరం బ్రహ్మోత్సవాలు, ఊరేగింపులో మంత్రి హరీశ్‌రావు, ఎంపీ పాల్గొన్నారు. హరీశ్‌రావును ఆలయ కమిటీ సభ్యులు సన్మానించారు. వారి వెంట సీనియర్‌ నాయకులు ఆర్‌.రాజమౌళి,  ఎంపీపీ పుష్పలత, జడ్పీటీసీ రవీందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మెన్‌ వనితారెడ్డి, కౌన్సిలర్‌లు ఆస యాదగిరి, ఆసస్వామి, పల్లెమీనా, నిమ్మరజిత, దేవుని లలిత, ఉన్నారు.

- మంత్రి, ఎంపీలకు రాఖీ కట్టిన మహిళా ప్రజాప్రతినిధులు

దుబ్బాక పర్యటనకు వచ్చిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌ రెడ్డి దుబ్బాక మండలం మహిళా ప్రజాప్రతినిధులు రాఖీ కట్టారు. దుబ్బాక ఎంపీపీ కొత్త పుష్పలత, మున్సిపల్‌ చైర్మెన్‌ వనితారెడ్డి, ఎంపీటీసీలు రాఽధామనోహర్‌రెడ్డి, రామవరపు మాధవి, కౌన్సిలర్లు పల్లెమీనా, ఆససులోచన, దేవుని లలిత, నందాల శ్రీజా, పులిగారి కల్పన రాఖీ కట్టారు.  

Updated Date - 2022-08-11T06:06:34+05:30 IST