హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): జాతీయ సీనియర్ మహిళల హ్యాండ్‌బాల్ చాంపియన్‌షి్‌పలో తెలంగాణ సెమీఫైనల్ బెర్త్ సాధించింది. శుక్రవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగిన రెండో క్వార్టర్స్‌లో తెలంగాణ 27-22తో రాజస్థాన్‌పై గెలిచింది. శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, జాతీయ హ్యాండ్‌బాల్ సంఘం అధ్యక్షుడు జగన్మోహన్ రావు తెలంగాణ జట్టును అభినందించారు. అంతకుముందు ప్రీ క్వార్టర్స్‌లో తెలంగాణ 24-8తో ఆంధ్రప్రదేశ్‌పై నెగ్గింది.