తెలంగాణకు వర్ష సూచన! రాబోయే మూడు రోజుల్లో...

ABN , First Publish Date - 2021-07-19T00:11:07+05:30 IST

రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా తెలిపింది.

తెలంగాణకు వర్ష సూచన! రాబోయే మూడు రోజుల్లో...

హైదరాబాద్: రాబోయే మూడు రోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తాజాగా తెలిపింది. ఉత్తర, దక్షిణ తెలంగాణ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. ఒకటి రెండు చోట్ల మాత్రం భారీ వర్షం పడొచ్చని చెప్పింది. ఈ క్రమంలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడొచ్చనేది వాతావరణ శాఖ అంచనా. మధ్యప్రదేశ్ విధర్భ, తెలంగాణ, రాయలసీమ, దక్షిణ తమిళనాడు వరకూ సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తున ఏర్పడిందని, ఈ ఉపరితల ద్రోణి ఇంకా కొనసాగుతోందని వాతావరణ శాఖ తన తాజా నివేదికలో పేర్కొంది.

Updated Date - 2021-07-19T00:11:07+05:30 IST