మన ఊరు - మన బడి టెండర్లపై టీ.Highcourt మధ్యంతర ఉత్తర్వులు

ABN , First Publish Date - 2022-07-06T19:41:28+05:30 IST

మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

మన ఊరు - మన బడి టెండర్లపై టీ.Highcourt మధ్యంతర ఉత్తర్వులు

హైదరాబాద్: మన ఊరు- మన బడి టెండర్ల ప్రక్రియపై హైకోర్టు (High court) మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.  మన ఊరు - మన బడి టెండర్లపై బుధవారం హైకోర్టులో విచారణ జరిగింది. వీ3 ఎంటర్ ప్రైజెస్ లిమిటెడ్ పిటిషన్‌ దాఖలు చేసింది. తదుపరి ఆదేశాలు వచ్చే వరకు టెండర్ల ప్రక్రియ ఆపేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఎలగంట్ మేథడక్స్ సంస్థ టెండర్ అన్ని నిబంధనలు భర్తీ చేసి అర్హత సాధించినట్టు పేర్కొనడం చట్టవిరుద్దం అని పిటిషనర్లు పేర్కొన్నారు. టెండర్ నిబంధనలలోని అన్ని అర్హతలు తమకున్నాయని పిటిషనర్లు కోర్టుకు తెలియజేశారు. అన్ని ఆధారాలు సమర్పించినప్పటికీ కారణం చెప్పకుండా టెండర్ ఇవ్వలేదని కోర్టుకు చెప్పారు. ఏ కారణంగా అర్హత లేని కాంట్రాక్టరుగా చూపారో వెల్లడించలేదని పిటిషనర్లు తెలిపారు. పిటిషన్‌లో  పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి, టీఎస్ డబ్ల్యూఐ డీసీ(తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ మౌలిక వసతులు అభివృద్ధి సంస్థ), చీఫ్ ఇంజనీరు, ఎలెగంట్ మెథడాక్స్‌లను ప్రతివాదులుగా ఉన్నారు. విచారణ జరిపిన హైకోర్టు టెండర్ల ప్రక్రియపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ... తదుపరి విచారణ ఈనెల 11న సోమవారానికి వాయిదా వేసింది. 


Updated Date - 2022-07-06T19:41:28+05:30 IST