సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్

సినిమా టికెట్ల ధరలు పెంచుకునేందుకు హైకోర్ట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇది ఏపీలో కాదు తెలంగాణ రాష్ట్రంలో. ఏపీలో సినిమా టికెట్ల ధరలపై ప్రభుత్వ తీరు ఏంటనేది తాజాగా విడుదల చేసిన నూతన ధరలు చెప్పకనే చెబుతున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడున్న టికెట్ ధరలకు అదనంగా రూ. 50 పెంచుకునేలా అనుమతి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని థియేటర్ల యాజమన్యాలు కోరాయి. కానీ ప్రభుత్వం నుండి ఎటువంటి స్పందన రాకపోవడంతో.. ఈ విషయమై థియేటర్ల యాజమాన్యం కోర్టును ఆశ్రయించింది. 


టికెట్ల ధరలపై ప్రభుత్వం నియమించిన కమిటీ ఇంత వరకు తుది నిర్ణయం తీసుకోలేదు కాబట్టి.. అప్పటి వరకు తాము నిర్ణయించిన టికెట్ ధరలతో థియేటర్లను నడుపుకునేందుకు అనుమతి ఇవ్వాలని థియేటర్ల యాజమాన్యం కోర్టుకు వాదనలు వినిపించగా.. వారి వాదనలకు కోర్టు అంగీకారం తెలిపింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన చిత్రాలకు రూ. 50 పెంచుకునేందుకు థియేటర్ల యాజమాన్యాలకు అనుమతి ఇవ్వాలని తెలంగాణ హైకోర్ట్ ఆదేశించింది.  

Advertisement