Abn logo
Aug 9 2021 @ 19:46PM

తెలంగాణ తెచ్చిన ధైర్యంతోనే దళిత బంధు: హరీశ్‌రావు

సిద్దిపేట: డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఆశయస్ఫూర్తికి తోడుగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ధైర్యంతోనే సీఎం కేసీఆర్‌ దళితబంధును అమలు చేస్తున్నారని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దళిత బంధు డబ్బులను ఆదాయం పెంపొందించే ఉపాధి, వ్యాపార మార్గాలపై వెచ్చించాలని సూచించారు. కుల, మత, రాజకీయాలకతీతంగా పథకాలు అమలుచేసిన మాదిరిగానే దళిత బంధును పారదర్శకంగా అందిస్తామని చెప్పారు. రైతుబంధు మాదిరిగానే దళితబంధు కూడా దేశవ్యాప్తంగా అమలు జరపాలని ఇతర రాష్ట్రాల సీఎంలపైనా ఒత్తిడి పెరుగుతుందన్నారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపుతున్న సీఎం కేసీఆర్‌ సంకల్పాన్ని నిలబెట్టేందుకు కంకణబద్ధులవ్వాలని హరీశ్‌రావు సూచించారు. 

క్రైమ్ మరిన్ని...