Governor Tamilisai: మూడు నెలల క్రితమే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో కుండబద్ధలు కొట్టిన తమిళిసై

ABN , First Publish Date - 2022-09-08T23:12:09+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr) తెలంగాణ గవర్నర్ తమిళిసై ( GovernorTamili Sai) మధ్య కొంతకాలంగా గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే..

Governor Tamilisai: మూడు నెలల క్రితమే ‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’లో కుండబద్ధలు కొట్టిన తమిళిసై

హైదరాబాద్: తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా తాజాగా రాజ్‌భవన్‌లో ఆమె (Telangana governor) మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహారిస్తున్న శైలిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చాలాసార్లు తనను ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించట్లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఇదే విషయాన్ని గవర్నర్ తమిళిసై మూడు నెలల క్రితం నిర్వహించిన ‘‘ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే’’ కార్యక్రమంలో ఆమె కుండబద్ధలు కొట్టారు. 


కాగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ (Cm Kcr)  తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamili Sai) మధ్య కొంతకాలంగా గ్యాప్ పెరిగిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఎప్పుడైతే దేశ రాజకీయాల వైపు దృష్టి పెట్టారో అప్పటినుంచి కేంద్రానికి ఆయన సహకరించడంలేదని రాష్ట్ర బీజేపీ నేతలు అంటున్నారు. కేంద్రమే రాష్ట్రంపై వివక్ష చూపుతోందని టీఆర్ఎస్ నేతలు (Trs Leaders) చెబుతున్నారు. అయితే ప్రధాని మోదీ (Pm Modi) హైదరాబాద్ వచ్చిన సందర్భంగా సీఎం కేసీఆర్ రిసీవ్ చేసుకోకపోవడంపై అప్పట్లో చర్చనీయాంశమైంది. 


ఇదిలా ఉంటే  తెలంగాణ అసెంబ్లీ (Ts Assembly) సమావేశాల ప్రారంభంలో గవర్నర్ తమిళిసై ప్రసంగం లేకుండా సభ సాగింది. అప్పటి నుంచి తెలంగాణ ప్రభుత్వం (Telangana Governor).. రాజ్ భవన్ (Raj Bhavan) మధ్య మాటలు లేకుండా పోయింది. సీఎం కేసీఆర్ తనను అవమానించారని గవర్నర్ తమిళి సై ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రాష్ట్రంలో తమిళి సై నిర్వహించిన పర్యటనల్లో కూడా తనకు భద్రత కల్పించకపోవడంపై తప్పుబట్టారు. 


అంతకుముందు అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్, గవర్నర్ తమిళిసై.. ఆ తర్వాత ఒకసారి మినహా వీరిద్దరూ ఒకే వేదికపై ఎక్కడా కన్పించలేదు. ప్రస్తుతం సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై మరింత దూకుడు పెంచారు. అటు బీజేపీ నేతలు కూడా రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై ఎప్పటికప్పుడు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. 


Updated Date - 2022-09-08T23:12:09+05:30 IST