Cm Kcr Vs Governor Tamilisai: ఆ భవన్‌పై కాకి ఈ భవన్‌పై ఎందుకు వాలడం లేదు?

ABN , First Publish Date - 2022-09-09T01:12:27+05:30 IST

తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై (Telangana governor Tamilisai)నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా...

Cm Kcr Vs Governor Tamilisai:  ఆ భవన్‌పై కాకి ఈ భవన్‌పై ఎందుకు వాలడం లేదు?

హైదరాబాద్ (Hyderabad):  తెలంగాణ గవర్నర్‌గా తమిళిసై (Telangana governor Tamilisai)నేటితో మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రాజ్‌భవన్‌ (RajBhavan)లో ఆమె  మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రభుత్వం వ్యవహారిస్తున్న శైలిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం చాలాసార్లు తనను ఇబ్బందులకు గురి చేసిందని మండిపడ్డారు. గవర్నర్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కనీసం ప్రోటోకాల్ పాటించట్లేదని తమిళిసై ఆవేదన వ్యక్తం చేశారు. ఇది అనేక సందర్భాల్లో బయట పడిందని, ప్రభుత్వం చాలాసార్లు తనను ఇబ్బందిపెట్టిందన్నారు. అయినా తాను భయపడలేదని చెప్పారు. ఇదంతా ఎవరి కోసం చేస్తున్నారని ప్రశ్నించారు. తనతో రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చిన ఇబ్బంది ఎంటని ప్రశ్నించారు. మహిళా గవర్నర్‌గా తనను చాలా తక్కువ అంచనా వేశారని, ఒక మహిళగా పురుషుల కంటే ఎక్కువగా కష్టపడి పని చేయగలనని ఆయన చెప్పారు. సమ్మక్క సారలమ్మ జాతర సందర్భంగా ప్రభుత్వాన్ని హెలీకాఫ్టర్ అడిగితే ఇవ్వలేదన్నారు. చివరి క్షణం వరకు రాష్ట్ర ప్రభుత్వం తనకు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని.. అయినా దాదాపు నాలుగు గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణం చేసి గిరిజన ప్రజల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ దగ్గరకు చేరానని గవర్నర్ తమిళి సై తెలిపారు.


ఈ నేపథ్యంలో ‘‘సీఎం కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై ఎందుకు విరుచుకుపడ్డారు?. బడ్జెట్ సమావేశాలు కూడా గవర్నర్ లేకుండా జరపడం ప్రతీకారం కాదా?. గవర్నర్ తమిళిసై పరిధి దాటి  వివాదాస్పద కేంద్రంగా మారారా?. ఆ భవన్‌పై కాకి ఈ భవన్‌పై ఎందుకు వాలడం లేదు?. రెండు కీలక వ్యవస్థల మధ్య ఇంతదూరం ఎందుకు పెరిగింది?.’’ అనే అంశాలపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి డిబేట్ నిర్వహించింది. ఈ డిబేట్ వీడియోను చూడగలరు. 

Updated Date - 2022-09-09T01:12:27+05:30 IST