హైదరాబాద్: తెలంగాణలో 8 మంది ఐఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈపీటీఆర్‌ఐ డైరెక్టర్ జనరల్‌గా వాణి ప్రసాద్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్లుగా పౌసుమి బసు, శృతి ఓజా, పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ విభాగం కార్యదర్శిగా నిర్మల, విపత్తు నిర్వహణ శాఖ కార్యదర్శిగా మాణిక్య రాజ్, విద్యాశాఖ ఉపకార్యదర్శిగా హరిత, ఎమ్‌సీఆర్‌హెచ్‌డీ డైరెక్టర్ జనరల్‌గా అనితా రాజేంద్ర, పశుసంవర్ధక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఆధార్ సిన్హాను బదిలీ చేసింది.
కాగా హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ఎట్టకేలకు పలువురు ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు కల్పించింది. గత కొన్నేళ్లుగా పోస్టింగులు ఇవ్వకుండా పలువురు ఐఏఎస్‌లను కాళీగా ఉంచింది. హైకోర్టులో బుధవారం ఇదే అంశంపై ప్రజాప్రయోజన వాజ్యం విచారణ జరిగింది. ఎట్టకేలకు వెయిటింగ్‌లో ఉన్న ఐఏఎస్‌లకు పోస్టింగ్‌లు ఇచ్చింది.