కోర్టు ధిక్కరణ కేసులకు 58 కోట్ల కేటాయింపు జీవోపై హైకోర్టు విచారణ

ABN , First Publish Date - 2021-08-11T20:18:44+05:30 IST

కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్ల కేటాయింపు జీవోపై హైకోర్టు విచారించింది. భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమే జీవో జారీ చేసినట్టు కోర్టుకు ఏజీ తెలిపారు.

కోర్టు ధిక్కరణ కేసులకు 58 కోట్ల కేటాయింపు జీవోపై హైకోర్టు విచారణ

హైదరాబాద్: కోర్టు ధిక్కరణ కేసులకు రూ.58 కోట్ల కేటాయింపు జీవోపై హైకోర్టు విచారించింది. భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమే జీవో జారీ చేసినట్టు కోర్టుకు ఏజీ తెలిపారు. నిధులు విడుదల చేయవద్దన్న ఉత్తర్వులు ఉపసంహరించాలని ఏజీ కోరారు. జీవో తప్పుదోవ పట్టించేలా ఉందని హైకోర్టు వ్యాఖ్యానించింది. భూసేకరణ పరిహారం చెల్లింపు కోసమని జీవోలో ప్రస్తావించాలని, సవరించిన జీవో సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ ఈనెల 13కి కోర్టు వాయిదా వేసింది. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ. 58 కోట్ల కేటాయింపుపై హైకోర్టుకు సీఎస్ సోమేష్ కుమార్ వివరణ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ రూ. 58 కోట్లు తనపై కోర్టు ధిక్కరణ కేసుల కోసం కాదని అన్నారు. భూసేకరణ పరిహారం చెల్లింపు కేసుల్లో కోర్టు ధిక్కరణ కేసుల కోసమేనని ఏజీ తెలిపారు. పిటిషనర్ కోర్టును తప్పుదోవ పట్టించారని సీఎస్ సోమేష్‌కుమార్ తెలిపారు. విచారణ సందర్భంగా వాస్తవాలు కోర్టు ముందుంచలేకపోయామని సీఎస్ అన్నారు.


Updated Date - 2021-08-11T20:18:44+05:30 IST