విద్యా వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి మానుకోవాలి: చాడ

ABN , First Publish Date - 2021-12-23T23:54:06+05:30 IST

విద్యా వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హితవుపలికారు.

విద్యా వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్యవైఖరి మానుకోవాలి: చాడ

హైదరాబాద్: విద్యా వ్యవస్థపై తెలంగాణ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి మానుకోవాలని సీపీఐ తెలంగాణ కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి హితవుపలికారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇంటర్‌ పరీక్షా విధానంలో అవకతవకలపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోకపోవడం తగదన్నారు. ప్రభుత్వ గందరగోళ వైఖరితోనే విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. ఆన్‌లైన్‌లో విద్యను సక్రమంగా అందించకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చిందన్నారు. ఫెయిలైన ఇంటర్‌ ఫస్టియర్‌ విద్యార్థుల సమస్యపై సానుకూలంగా స్పందించాలని కోరారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని చాడ వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Updated Date - 2021-12-23T23:54:06+05:30 IST