తెలంగాణలో యాభైవేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

ABN , First Publish Date - 2021-07-12T15:48:08+05:30 IST

తెలంగాణలో ఒకేసారి యాభైవేల ఉద్యోగాల భర్తీకి సర్కార్ రంగం సిద్ధం చేసింది.

తెలంగాణలో యాభైవేల ఉద్యోగాల భర్తీకి రంగం సిద్ధం

హైదరాబాద్: తెలంగాణలో ఒకేసారి యాభైవేల ఉద్యోగాల భర్తీకి సర్కార్ రంగం సిద్ధం చేసింది. రేపు జరిగే మంత్రి వర్గ సమావేశంలో ఉద్యోగాల భర్తీకి ఆమోదం లభించనుంది. ఈ మేరకు శాఖల వారీగా ఖాళీల వివరాలను ఇప్పటికే  ఆర్థికశాఖ అధికారులు సేకరించారు. ఉద్యోగాల భర్తీతో పాటు పదోన్నతులపైనా సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకోనున్నారు. 32 శాఖల్లో 45 వేలకుపైగా ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని సర్కార్ ప్రణాళికలు రూపొందింది. మంగళవారం కేబినెట్ ఆమోదం తరువాత కొత్త జిల్లాలు, కొత్త జోన్ల వారీగా నోటిఫికేషన్లు జారీ చేసేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. 

Updated Date - 2021-07-12T15:48:08+05:30 IST