ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

ABN , First Publish Date - 2020-06-02T21:07:15+05:30 IST

ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్

ఆస్ట్రేలియాలో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు

సిడ్నీ: ఆస్ట్రేలియాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా శాఖ అధ్యక్షుడు కాసర్ల నాగేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సిడ్నీ, మెల్బోర్న్, కాన్బెర్రా, బ్రిస్బేన్, అడిలైడ్ నగరాలలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. కాన్బెర్రా నగరంలో యాక్ట్ కన్వీనర్ రవి సాయల ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా రవి సాయల మాట్లాడుతూ..  తెలంగాణ ఉద్యమ నేపథ్యాన్ని, స్వరాష్ట్రాన్ని సాధించిన తరువాత రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న వివిధ పథకాల గురించి వివరించారు. భవిష్యత్ ప్రణాళికల పట్ల ప్రభుత్వానికి ఉన్న స్పష్టత గురించి మాట్లాడారు. అంతేకాకుండా బంగారు తెలంగాణ నిర్మాణంలో ఎన్నారైల ప్రాముఖ్యతను గుర్తుచేశారు. మెల్బోర్న్‌లో టీఆర్ఎస్ ఆస్ట్రేలియా అధ్యక్షుడు నాగేందర్ రెడ్డి మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో తాము చేపట్టిన వివిధ కార్యక్రమాల గురించి వివరించారు. బంగారు తెలంగాణ సాధనలో తమవంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి, ఆస్ట్రేలియా ప్రభుత్వానికి, ఆస్ట్రేలియాలోని ఎన్నారైలకు తాము సమన్వయకర్తలుగా తమ తోడ్పాటును ఎలా అందించగలమో వివరించారు. కాన్బెర్రాలో నిర్వహించిన వేడుకల్లో ముఖ్యనాయకులు రాకేష్ లక్కరసు వీరేందర్ సాంబరాజు, కిశోర్, శ్రీధర్ తదితరులు పాల్గొని విజయవంతం చేశారు.

Updated Date - 2020-06-02T21:07:15+05:30 IST