Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement
Published: Tue, 17 May 2022 04:21:52 IST

ఎవరెస్టుపై తెలంగాణ కీర్తి పతాక!

twitter-iconwatsapp-iconfb-icon
ఎవరెస్టుపై తెలంగాణ కీర్తి పతాక!

నేపాల్‌ మార్గంలో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అన్విత

ఈ ఘనత సాధించిన తెలంగాణ తొలి మహిళగా రికార్డు

భువనగిరి టౌన్‌, మే 16: తెలంగాణ కీర్తి పతాక ఎవరెస్ట్‌ శిఖరాగ్రాన్ని చేరింది. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన పర్వతారోహకురాలు 24 ఏళ్ల పడమటి అన్విత ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించారు. 29,112 అడుగుల (8,848.86 మీటర్లు) ఎత్తయిన ఎవరెస్ట్‌ శిఖరాగ్రానికి చేరుకున్న అన్విత.. నేపాల్‌ మార్గంలో శిఖరాన్ని అధిరోహించిన తెలంగాణ తొలి మహిళగా, ఎవరెస్ట్‌ ఎక్కిన తెలంగాణ రెండో మహిళగా రికార్డు నెలకొల్పారు. అక్కడ జాతీయ జెండాతో పాటు భువనగిరి ఖిల్లా, ట్రాన్సెండ్‌ అడ్వెంచర్స్‌, స్పాన్సర్స్‌ ఫ్లెక్సీలను సగర్వంగా ప్రదర్శించి వెనుదిరిగారు. మంగళవారం సాయంత్రానికి ఆమె బేస్‌ క్యాంప్‌కు చేరుకోనున్నారు. కాగా, 2014లో అప్పటి సాంఘిక సంక్షేమ ఆశ్రమ పాఠశాల విద్యార్థిని పూర్ణ.. చైనా మార్గంలో ఎవరె్‌స్టను అధిరోహించిన తెలంగాణ తొలి మహిళగా రికార్డులకెక్కారు. ఆ తర్వాత ఇప్పుడు అన్విత ఈ రికార్డు సాధించారు. ఏప్రిల్‌ 17న ఎవరెస్ట్‌ బేస్‌ క్యాంప్‌కు చేరుకున్న అన్విత అక్కడి శీతోష్ణ పరిస్థితులకు అనుగుణంగా శిక్షణ పొంది ఈ నెల 9వ తేదీన ఎవరెస్ట్‌ శిఖరాన్ని అధిరోహించడం ప్రారంభించారు. ఈ క్రమంలో.. 16న లక్ష్యాన్ని చేరుకున్నారు. భువనగిరి ఖిల్లాపై పర్వతారోహణలో ప్రాథమిక శిక్షణ పొందిన అన్విత గత ఏడాది డిసెంబరు 7న మైనస్‌ 40 డిగ్రీల చలిలో 18,510 అడుగుల ఎత్తయిన ఎలబ్రూస్‌ పర్వతాన్ని అధిరోహించారు. 

ఎవరెస్టుపై తెలంగాణ కీర్తి పతాక!

ఈ క్రమంలో.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళగా రికార్డు సృష్టించారు. 2015లో సిక్కింలోని 4,800 మీటర్ల ఎత్తయిన రినాక్‌ పర్వతాన్ని, 2019లో 6,400 మీటర్ల బీసిరాయ్‌ పర్వతాన్ని, 2020 జనవరిలో 5,896 మీటర్ల ఎత్తయిన ఖిలిమంజారో పర్వతాన్ని, 2021 ఫిబ్రవరిలో లడక్‌లోని ఆరు వేల మీటర్ల ఎత్తయిన ఖడే పర్వతాన్ని అధిరోహించారు. ప్రస్తుతం ఆమె భువనగిరి రాక్‌ క్లైంబింగ్‌ స్కూల్‌ కోచ్‌గా, స్వచ్ఛ సర్వేక్షణ్‌ భువనగిరి మునిసిపాలిటీ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. అన్విత మానసిక సంకల్పం, పర్వతారోహణలో చూపిన పట్టుదల, శారీరక ధృడత్వంతోనే ఎవరెస్ట్‌ అధిరోహణ సాధ్యమైందని ఆమె కోచ్‌ బాచినపల్లి శేఖర్‌బాబు తెలిపారు. భువనగిరి మండలం ఎర్రంబెల్లి గ్రామానికి చెందిన అన్విత తండ్రి పడమటి మధుసూదన్‌రెడ్డి రైతు కాగా.. తల్లి చంద్రకళ భువనగిరిలో అంగన్‌వాడీ టీచర్‌గా పని చేస్తున్నారు. . 

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.