తెలంగాణ Emcet, Ecet ఫలితాలు విడుదల

ABN , First Publish Date - 2022-08-12T16:33:23+05:30 IST

తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. (Telangana Emcet Results released). ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి విడుదల చేశారు

తెలంగాణ Emcet, Ecet ఫలితాలు విడుదల

హైదరాబాద్‌: తెలంగాణ ఎంసెట్‌, ఈసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. (Telangana Emcet Results released). ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి  విడుదల చేశారు. జూలై 18 నుంచి 20వ తేదీ వరకు ఎంసెట్‌ ఇంజనీరింగ్‌, జూలై 30-31 తేదీల్లో అగ్రికల్చర్‌, ఫార్మసీ ఎంట్రన్స్‌ పరీక్షలను నిర్వహించారు. అలాగే ఇంజనీరింగ్‌ రెండో ఏడాది కోర్సులో ప్రవేశాల (లేటరల్‌ ఎంట్రీ) కోసం ఆగస్టు 1న ఈసెట్‌ను నిర్వహించారు. అభ్యర్థులు ఎంసెట్‌ ఫలితాల కోసం https://eamcet.tsc-he.a-c.in, ఈసెట్‌ ఫలితాల కోసంం  https://ecet.tsche.ac.in వెబ్‌సైట్‌లను చూడవచ్చు.


ఈసెట్‌లో 90.69 శాతం ఉత్తీర్ణత నమోదైంది. 19,953 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. తెలంగాణ ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ టాప్‌ 2లో ఏపీ విద్యార్థులు నిలిచారు.


అగ్రికల్చర్‌లో..

ఫస్ట్ ర్యాంక్ నేహ(గుంటూరు)

సెకండ్ ర్యాంక్ రోహిత్‌(విశాఖ)

థర్డ్ ర్యాంక్ తరుణ్‌కుమార్(గుంటూరు)


ఇంజనీరింగ్‌లో..

ఫస్ట్ ర్యాంక్ లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి(హైదరాబాద్)

సెకండ్ ర్యాంక్ సాయిదీపిక(శ్రీకాకుళం)

థర్డ్ ర్యాంక్ కార్తికేయ(గుంటూరు) సాధించారు.

Updated Date - 2022-08-12T16:33:23+05:30 IST