కరోనా కాటుకు కెనడాలో తెలంగాణ వైద్యుడి మృతి!

ABN , First Publish Date - 2020-04-07T02:23:33+05:30 IST

కెనడాలో కరోనా మహమ్మారి ఓ తెలంగాణ వైద్యుడిని బలితీసుకుంది. వరంగల్‌కు చెందిన అబు అజ్హర్ (75) కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించారు. కెనడా వెళ్లి అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. 30ఏళ్లుగా పల్మనాలజిస్టుగా విధులు ని

కరోనా కాటుకు కెనడాలో తెలంగాణ వైద్యుడి మృతి!

న్యూఢిల్లీ: కెనడాలో కరోనా మహమ్మారి ఓ తెలంగాణ వైద్యుడిని బలితీసుకుంది. వరంగల్‌కు చెందిన అబు అజ్హర్ (75) కాకతీయ మెడికల్ కాలేజీలో వైద్యవిద్యను అభ్యసించారు. కెనడా వెళ్లి అక్కడే వైద్యుడిగా స్థిరపడ్డారు. 30ఏళ్లుగా పల్మనాలజిస్టుగా విధులు నిర్వహిస్తున్నారు. ఇటీవల ఆయనకు కరోనా వైరస్ సోకడంతో చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయారు. ఆయనను 10 రోజులపాటు వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆయన విద్యార్థి దశలో ఉన్నప్పుడు జాతీయ స్థాయిలో టేబుల్ టెన్నిస్ ఆడారు. అమెరికాలోని అలబామా రాష్ట్రంలో సర్జన్‌గా పని చేస్తున్న ఎరుబండి సత్యవర్దనరావు(73) న్యుమోనియాతో చనిపోయారు. ఆయన స్వస్థలం విశాఖపట్నం. ఆంధ్రా మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించారు. 50ఏళ్ల క్రితమే అమెరికాకు వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. మొదట ఆయన కూడా కరోనా వల్లే చనిపోయారని ప్రచారం జరిగింది. కానీ ఆంధ్రజ్యోతి అక్కడి వైద్యులతో మాట్లాడగా అయన న్యుమోనియాతో చనిపోయినట్లు వారు తెలిపారు. 


Updated Date - 2020-04-07T02:23:33+05:30 IST