తెలంగాణలో థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం: DH

ABN , First Publish Date - 2021-12-17T18:19:51+05:30 IST

తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి.

తెలంగాణలో థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధం: DH

హైదరాబాద్: తెలంగాణలో ఒమైక్రాన్ కలకలం రేపుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు ఎనిమిది ఒమైక్రాన్ కేసులు నమోదు అయ్యాయి. రాష్ట్రంలో రోజురోజుకూ ఒమైక్రాన్‌ కేసులు పెరుగుతున్నాయి. దీనిపై డీహెచ్ శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఇప్పటివరకూ ఒమైక్రాన్‌ సామూహిక వ్యాప్తి లేదన్నారు. నాన్‌ రిస్క్‌ దేశాల నుంచి వచ్చినవారిలో ఏడుగురికి ఒమైక్రాన్‌ ఉన్నట్లు గుర్తించామని,  కొత్తగా హనుమకొండలో మహిళకు ఒమైక్రాన్‌ నిర్థారించామని చెప్పారు. ఒమైక్రాన్‌ బాధితుల్లో ఎలాంటి లక్షణాలు లేవన్నారు. డెల్టా కంటే 8 రెట్లు ఎక్కువగా ఒమైక్రాన్‌ వ్యాప్తి ఉంటుందన్నారు. గతంలో కరోనా వచ్చిన వాళ్లకూ ఒమైక్రాన్‌ వస్తోందని తెలిపారు. రెండు డోస్‌లు తీసుకున్నవారికీ ఒమైక్రాన్‌ వస్తోందని అన్నారు. కాగా తెలంగాణలో కరోనా అదుపులోనే ఉందని డీహెచ్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు. 

Updated Date - 2021-12-17T18:19:51+05:30 IST