Abn logo
Apr 10 2020 @ 13:55PM

మీరు స్ఫూర్తిగా నిలిచారు: తెలంగాణ డీజీపీ

కోవిడ్ 19 ప్ర‌భావం నుండి ప్ర‌జ‌ల‌ను ర‌క్షించ‌డానికి పోలీసు శాఖ‌వారు అహ‌ర్నిశ‌లు క‌ష్ట‌ప‌డుతున్నారు. పోలీసు శాఖ ప‌నితీరు అంద‌రూ మెచ్చుకుంటున్నారు. లేటెస్ట్‌గా మెగాస్టార్ చిరంజీవి రెండు తెలుగు రాష్ట్రాల ప‌నితీరు మెచ్చుకుంటూ త‌న ట్విట్ట‌ర్‌లో ఓ వీడియో విడుద‌ల చేశారు. ఈ వీడియోపై తెలంగాణ డీజీపీ మహేంద‌ర్ రెడ్డి స్పందిస్తూ ‘‘మీరు మాకే కాదు.. పోలీసు శాఖవారందరికీ స్ఫూర్తినిచ్చారు. మీ నుండి స్ఫూర్తి పొందిన ప్రేక్షకులను కూడా మేల్కొలిపారు. పోలీసు కుటుంబంలో ఓ వ్యక్తిగా ఉన్న మీరు కోవిడ్‌పై మేం చేస్తున్న పోరాటానికి గొప్ప సాయాన్ని చేశారు. మీ మాట‌లు మ‌రింత మందిని లాక్‌డౌన్‌ను క‌ట్టుబ‌డి ఉంటార‌ని ఆశిస్తున్నాం’’ అన్నారు.

Advertisement
Advertisement
Advertisement