Abn logo
Feb 27 2021 @ 20:29PM

‘తెలంగాణ దేవుడు’.. రెడీ అవుతున్నాడు

శ్రీకాంత్‌, సంగీత ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం 'తెలంగాణ దేవుడు'.  ఇది 1969 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన పరిస్థితులను చూసి ప్రజల కష్టాలను తీర్చిన  ఒక ఉద్యమ ధీరుడి జీవిత చరిత్ర కథాంశం అంటున్నాడు దర్శకుడు వడత్యా హరీష్. ఆయన దర్శకత్వంలో మ్యాక్స్‌ల్యాబ్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకొని గుమ్మడికాయ కార్యక్రమం జరుపుకుంటున్న సందర్భంగా చిత్ర యూనిట్ హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో మీడియాతో ముచ్చటించారు.

ఈ కార్యక్రమంలో దర్శకుడు వడత్యా హరీష్ మాట్లాడుతూ... 1969 నుండి 2014 వరకు తెలంగాణలో ప్రజలు పడుతున్న కష్టాలను తీర్చడానికి ఒక ఉద్యమ ధీరుడుగా బయలుదేరి వారి కష్టాలను తీర్చిన ఉద్యమ ధీరుడి చరిత్రే  'తెలంగాణ దేవుడు'. ఈ చిత్రాన్ని ఎన్నో కమర్షియల్ ఎలిమెంట్స్, ఎమోషన్స్ జోడించి మంచి పాటలతో అన్ని రంగాల వారికి నచ్చే విధంగా చిత్రీకరించడం జరిగింది. నా మొదటి చిత్రంతోనే 50 మంది పెద్ద నటీనటులను డైరెక్షన్ చేసే అవకాశం రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ చిత్రాన్ని నిర్మించడానికి ధైర్యం ఇచ్చిన నిర్మాత మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ గారికి కృతజ్ఞతలు. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి సహకరించిన నటీనటులతో పాటు సాంకేతిక నిపుణులకు నా ధన్యవాదాలు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని అన్నారు

మాక్స్‌ల్యాబ్  సీఈవో మహ్మద్‌ ఇంతెహాజ్‌ అహ్మద్‌ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రాంతాలలో తెలంగాణ కోసం ఉద్యమం చేసి సాధించుకున్న తర్వాత ఏర్పడిన పరిణామాల గురించి ప్రస్పుటంగా ఈ చిత్రం ద్వారా తెలియజేయడం జరిగింది ఈ చిత్రంలో మహ్మద్‌ జాకీర్ ఉస్మాన్ గారి అబ్బాయి జిషాన్ ఉస్మాన్‌ను పరిచయం చేస్తున్నాము. కొత్తవాడైనా అద్భుతంగా నటించాడు. అందరి సహకారంతో పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని మార్చి చివరి వారంలో విడుదల చేస్తామని తెలిపారు. లైన్‌ ప్రొడ్యూసర్‌ మహ్మద్‌ ఖాన్‌, సంగీత దర్శకుడు నందన్‌ బొబ్బిలి కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడారు.

శ్రీకాంత్, సంగీత, జిషాన్ ఉస్మాన్ (తొలి పరిచయం), బ్రహ్మానందం, సునీల్, సుమన్, బ్రహ్మాజీ, వెంకట్, పృద్వి, రఘు బాబు, షాయాజి షిండే, విజయ్ రంగరాజు, బెనర్జీ, చిట్టిబాబు, మధుమిత, సత్య కృష్ణ, సన, రజిత, ఈటీవీ ప్రభాకర్, సమీర్, బస్ స్టాప్ కోటేశ్వరరావు, కాశీ విశ్వనాథ్, జెమిని సురేష్ వంటి ప్రముఖులు ఈ చిత్రంలో నటించారు. 

Advertisement
Advertisement
Advertisement