తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబురాలు!

ABN , First Publish Date - 2022-01-16T02:49:57+05:30 IST

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు సంక్రాంతి సంబురాలను 15 జనవరి న ఆన్లైన్‌లో జూమ్ ద్వారా కన్నులపండుగగా నిర్వహించారు.

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) ఆధ్వర్యంలో ఘనంగా సంక్రాంతి సంబురాలు!

తెలంగాణ కల్చరల్ సొసైటీ (సింగపూర్) వారు సంక్రాంతి సంబురాలను 15 జనవరి న ఆన్లైన్‌లో జూమ్ ద్వారా కన్నులపండుగగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పాటలు, నృత్యాలు ఎంతో అలరించాయి. వీటితో పాటు ముగ్గుల పోటీలు నిర్వహించి ఆన్లైన్ వోటింగ్ ద్వారా ఎన్నుకున్న ముగ్గురికి బహుమతులు అందజేశారు. సంబురాల్లో భాగంగా చిన్నారులు వేసిన హరిదాసు వేష ధారణలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా సింగపూర్ కాలమాన ప్రకారం జ్యోతిష్యులచే ప్రత్యేకంగా ముద్రించిన క్యాలెండర్‌ను విడుదల చేశారు. పండుగలను పెద్ద ఎత్తున నిర్వహిస్తూ భావితరాలకు మన పండుగల ప్రాముఖ్యతను తెలియజేస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉందని సభ్యులు తెలిపారు. ఈ సందర్భంగా, సంబరాలకు చేయూత, సహాయ సహకారాలు అందిస్తున్న వారందరికి TCSS కార్యవర్గ సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబురాలను ఆన్లైన్‌లో వేలాది మంది వీక్షించారు.


సంబరాలు విజయవంతంగా జరుగటానికి సహయo అందించిన దాతలకు, స్పాన్సర్స్‌కు,  ప్రతి ఒక్కరికి TCSS అధ్యక్షులు నీలం మహేందర్, ప్రధాన కార్యదర్శి బసిక ప్రశాంత్ రెడ్డి, కార్యదర్శి గడప రమేష్ బాబు తదితరులు  కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి సమన్వయకర్తలుగా రోజా రమణి, సునీత రెడ్డి, రజిత గోనె,  హరిత విజాపూర్, వందన కాసర్ల, రవి ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించారు. 


సొసైటీ  కోశాధికారి కల్వ లక్ష్మణ్ రాజు, ఉపాధ్యక్షులు గర్రెపల్లి శ్రీనివాస్, గోనె  నరేందర్ రెడ్డి, భాస్కర్ గుప్త నల్ల, మిర్యాల సునీత రెడ్డి, ప్రాంతీయ కార్యదర్శులు దుర్గ ప్రసాద్, జూలూరి సంతోష్, నంగునూరి  వెంకట రమణ, మరియు కార్యవర్గ సభ్యులు  నడికట్ల భాస్కర్, శ్రీధర్ కొల్లూరి, పెరుకు శివ రామ్ ప్రసాద్, గార్లపాటి లక్ష్మా రెడ్డి, అనుపురం శ్రీనివాస్, శివ ప్రసాద్ ఆవుల, శశిధర్ రెడ్డి, రవి కృష్ణ విజాపూర్, కాసర్ల శ్రీనివాస్ మరియు  ప్రవీణ్ మామిడాల.. సంబరాల్లో పాల్గొన్న వారందరికీ ధన్యవాదాలు తెలిపారు.

Updated Date - 2022-01-16T02:49:57+05:30 IST