ఎల్‌బ్రస్‌ శిఖరాగ్రంపై తెలంగాణ దంపతులు

ABN , First Publish Date - 2022-08-20T09:41:27+05:30 IST

రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన చాపల వెంకట్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు అతిపెద్ద సాహసం చేశారు.

ఎల్‌బ్రస్‌ శిఖరాగ్రంపై తెలంగాణ దంపతులు

ఆగస్టు 15న అక్కడ జాతీయ పతాక ఆవిష్కరణ

నిడమనూరు, ఆగస్టు 19: రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా నిడమనూరుకు చెందిన చాపల వెంకట్‌రెడ్డి, విజయలక్ష్మి దంపతులు అతిపెద్ద సాహసం చేశారు. ఐరోపా ఖండంలోనే అత్యంత ఎత్తయిన మౌంట్‌ ఎల్‌బ్రస్‌ పర్వతాన్ని ఆగస్టు 15వ తేదీన అధిరోహించారు. మైనస్‌ 20 డిగ్రీల ఉష్ణోగ్రతలో, గంటకు 50 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న ఈదురుగాలుల మధ్య పర్వతారోహణను విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సాహసయాత్ర కోసం 10వ తేదీన మాస్కో చేరుకున్న ఈ దంపతులు..  15వ తేదీ ఉదయం 5.55 గంటలకు ఎలబ్రస్‌ శిఖరాగ్రానికి చేరుకున్నారు. శిఖరాగ్రంపై జాతీయ జెండాను ఆవిష్కరించి, అజాదీ కా అమృత మహోత్సవ్‌ పోస్టర్‌ను ప్రదర్శించారు. కాగా, విజయలక్మీ.. త్రిపురారం మండలం కంపాసాగర్‌ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు.

Updated Date - 2022-08-20T09:41:27+05:30 IST