హైదరాబాద్: ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. 57 మంది పేషెంట్లు, 9 మంది వైద్య సిబ్బందికి కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. లక్షణాలున్న వారికి ఆస్పత్రి అధికారులు టెస్టులు చేయిస్తున్నారు. మానసిక రోగులు కావడంతో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని ఎర్రగడ్డ మానసిక ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.ఉమాశంకర్ తెలిపారు. లక్షణాలు తీవ్రంగా ఉన్న వారిని ఐసొలేషలో ఉంచామన్నారు.
ఇవి కూడా చదవండి