హైదరాబాద్: తెలంగాణలో రోజురోజుకు కరోనా కేసులు సంఖ్య పెరుగుతోంది. రాష్ట్రంలో ఇవాళ కొత్తగా 2,983 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్ తో ఇద్దరు మృతి చెందారు. తెలంగాణలో ఇప్పటివరకు మొత్తం 7,14,639 కరోనా కేసులు నమోదు కాగా, కరోనా వైరస్‌తో 4,062 మంది మరణించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో కొత్తగా 1,206 కరోనా కేసులు నమోదయ్యాయి.