తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

ABN , First Publish Date - 2020-08-09T14:30:52+05:30 IST

ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకూ విజృంభిస్తోంది.

తెలంగాణలో పెరుగుతున్న కరోనా కేసులు

హైదరాబాద్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో రోజురోజుకూ విజృంభిస్తోంది. గత వారం రోజులుగా కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతున్నాయి. తెలంగాణలో కొత్తగా 1,982 కరోనా కేసులు నమోదు అయినట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ మీడియా బులెటిన్‌లో పేర్కొంది. రాష్ట్రంలో 24 గంటల్లో కరోనాతో 12 మంది మాత్రమే మృతి చెందారని తెలిపింది. తాజాగా నమోదైన కేసులతో కలిపితే తెలంగాణలో మొత్తం కేసులు 79,495కు చేరుకున్నాయి. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 627 మరణాలు సంభవించాయి. ప్రస్తుతం తెలంగాణలో 22,869 యాక్టివ్ కేసులుండగా.. 55,999 మంది కరోనాను జయించి సంపూర్ణ ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఇప్పటి వరకు తెలంగాణ వ్యాప్తంగా 6,13,231 కరోనా టెస్టులు చేసినట్లు వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. 


కొత్తగా నమోదైన కేసుల్లో...

జీహెచ్ఎంసీలో- 463

మేడ్చల్‌‌లో - 141 

రంగారెడ్డిలో - 139

కరీంనగర్‌లో- 96

గద్వాలలో - 93 

జనగాంలో - 78

వరంగల్‌ అర్బన్‌లో - 71

పెద్దపల్లిలో - 71

భద్రాద్రిలో - 64

కామారెడ్డిలో- 62

నల్గొండలో- 59

నిజామాబాద్‌‌లో- 58

సిద్దిపేటలో- 55

సంగారెడ్డిలో- 49 కేసులు నమోదైనట్లు బులెటిన్‌లో ఆరోగ్య శాఖ పేర్కొంది. కాగా.. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల వల్ల గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో ఆగస్టు నెలాఖరుకు, మిగతాచోట్ల సెప్టెంబరు చివరికల్లా కరోనా అదుపులోకి వస్తుందని ప్రజారోగ్య సంచాలకులు (డీపీహెచ్‌) డాక్టర్‌ గడల శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేసిన విషయం విదితమే.

Updated Date - 2020-08-09T14:30:52+05:30 IST