హైదరాబాద్: కాంగ్రెస్ నాయకులంతా పార్టీ లైన్లో క్రమశిక్షణతో పనిచేయాలని వ్యవహారాల ఇన్చార్జ్ మానిక్కం ఠాగూర్ ఆదేశించారు. రాష్ట్ర వ్యవహారాల కమిటీ సమావేశంలో పాల్గొన్న ఆయన జనవరి 10 నుంచి ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు. ఏఐసీసీ ప్రకటించిన కార్యక్రమాలను నేతలు కిందిస్థాయిలో చిత్తశుద్ధితో చేపట్టాలని సూచించారు. త్వరలో ఏఐసీసీ శిక్షణ కార్యక్రమాలు, జన జాగరణ, పాదయాత్రలు చేపడతామని తెలిపారు. అన్ని కార్యక్రమాల్లో నాయకులు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. డిజిటల్ మెంబర్షిప్ కార్యక్రమాలను నిర్ణీత సమయంలో పూర్తి చేయాలని పార్టీ నేతలకు మానిక్కం ఠాగూర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి, షబ్బీర్ అలీ, పీఏసీ సభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రంలో పార్టీపరంగా ఇప్పటివరకు జరిగిన కార్యక్రమాల వివరాలను ఈ సందర్భంగా పీఏసీ సభ్యులకు రేవంత్ తెలిపారు.
ఇవి కూడా చదవండి