పీయూష్‌ గోయల్‌కు బుద్ధి ఉందా?: కేసీఆర్‌

ABN , First Publish Date - 2022-04-13T00:20:56+05:30 IST

కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు బుద్ధి ఉందా? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. కేబినెట్ భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంపై..

పీయూష్‌ గోయల్‌కు బుద్ధి ఉందా?: కేసీఆర్‌

హైదరాబాద్: కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌కు బుద్ధి ఉందా? అని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. కేబినెట్ భేటీ తర్వాత ఆయన మాట్లాడుతూ కేంద్రప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రంలో దిక్కుమాలిన, దరిద్రపు ప్రభుత్వం ఉందని మండిపడ్డారు.  వ్యవసాయరంగాన్ని కార్పొరేట్లకు అప్పగించే కుట్ర చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు.  వ్యవసాయరంగాన్ని కుదేలు చేయాలని చూస్తున్నారని,  వ్యవసాయాన్ని ఉపాధి హామీకి అనుసంధానం చేయాలని డిమాండ్ చేశారు. ఎరువులపై భారీగా ధరలు పెంచారని,  తెలంగాణ ధాన్యం విషయంలో కేంద్రం పిచ్చిగా వ్యవహరించిందన్నారు.  తెలంగాణ ప్రజలను నూకలు తినమంటారా అని ప్రశ్నించారు. దేశ ఆహార భద్రత కేంద్రానిదేనని గుర్తు చేశారు. పెట్రోల్‌, డీజిల్‌పై తాము పైసా పెంచలేదని, కేంద్రమే రోజు రోజుకు ధరలు పెంచుతోందని మండిపడ్డారు.  ‘‘కేంద్రం బలంగా ఉండాలా?.. రాష్ట్రం బలహీనంగా ఉండాలా?. ధాన్యం కొనడానికి కేంద్రం వద్ద డబ్బులు లేవా?.. ప్రధాని మోదీకి మనసు లేదా?. ’’ అని కేసీఆర్ ప్రశ్నించారు. 




Updated Date - 2022-04-13T00:20:56+05:30 IST