తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ.. కొత్త సీజే ఎవరంటే..

ABN , First Publish Date - 2022-05-17T20:05:14+05:30 IST

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్‌కు పదోన్నతి కల్పిస్తూ..

తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ.. కొత్త సీజే ఎవరంటే..

హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ సతీష్ చంద్రశర్మ ఢిల్లీ హైకోర్టుకు బదిలీ అయ్యారు. తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ఉజ్జల్ భూయాన్‌కు పదోన్నతి కల్పిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. గతంలో సతీష్ చంద్రశర్మ కర్ణాటక హైకోర్టులో తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టుకు 2008 జనవరి 18న అదనపు న్యాయమూర్తిగా అపాయింట్ అయిన ఆయన జనవరి 15, 2010న పర్మిమెంట్ జడ్జి అయ్యారు. 2021 అక్టోబర్‌లో తెలంగాణ ప్రధాన న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు.



తాజాగా చీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందిన జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా ఉన్నారు. అక్టోబర్ 17, 2011న ఉజ్జల్ గౌహతి హైకోర్టుకు అడిషనల్ జడ్జిగా అపాయింట్ అయ్యారు. 03.10.2019న బాంబే హైకోర్టుకు ఆయన బదిలీ అయ్యారు. 22.10.2021న తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా ఆయన బాధ్యతలు అందుకున్నారు. అంతేకాదు.. తెలంగాణ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కూడా జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వ్యవహరిస్తున్నారు.

Updated Date - 2022-05-17T20:05:14+05:30 IST