లాక్‌డౌన్ కొనసాగింపుపై సస్పెన్స్.. మే 20న కేబినెట్ మళ్లీ భేటీ

ABN , First Publish Date - 2021-05-12T00:36:33+05:30 IST

లాక్‌డౌన్ కొనసాగింపుపై సస్పెన్స్.. మే 20న కేబినెట్ మళ్లీ భేటీ

లాక్‌డౌన్ కొనసాగింపుపై సస్పెన్స్.. మే 20న కేబినెట్ మళ్లీ భేటీ

హైదరాబాద్: మే 20న మళ్లీ తెలంగాణ కేబినెట్‌ మరోసారి సమావేశంకానుంది. లాక్‌డౌన్ కొనసాగించే విషయంపై అదే రోజు నిర్ణయం తీసుకోనున్నారు. టీకా కొనుగోలు కోసం గ్లోబల్‌ టెండర్లు పిలవాలని కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్‌లోనూ రెమ్‌డెసివిర్‌, ఆక్సిజన్‌, కరోనా మందుల్ని అందుబాటులోకి తేవాలని సీఎస్‌ను తెలంగాణ కేబినెట్‌ ఆదేశించింది. అన్ని జిల్లాల్లో మంత్రుల అధ్యక్షతన కమిటీ వేయాలని నిర్ణయించారు. కలెక్టర్‌, డీఎంహెచ్‌వో, ఆస్పత్రుల సూపరింటెండెంట్లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లతో కమిటీ వేయాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. ప్రతిరోజూ మంత్రులు కరోనాపై సమీక్ష చేయాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ ఆదేశించారు. రెమ్‌డెసివిర్‌ ఉత్పత్తిదారులతో సీఎం కేసీఆర్‌  ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రానికి తగినన్ని మందులను సరఫరా చేయాలని కోరారు. మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన టాస్క్‌ఫోర్స్‌ నియామకానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ప్రతి రోజు మందులు, వ్యాక్సిన్లను వేగవంతంగా సమకూర్చి సరఫరా చేయడం కోసం ఈ టాస్క్‌ఫోర్స్‌ పనిచేయనుంది. 

Updated Date - 2021-05-12T00:36:33+05:30 IST