మళ్ళీ మళ్లీ చెబుతున్నా... ‘సాలు దొర... సెలవు దొర’

ABN , First Publish Date - 2022-07-02T23:29:30+05:30 IST

బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ (Telangana)ను ఎంచుకోవడం... ప్రధాని మోదీ..

మళ్ళీ మళ్లీ చెబుతున్నా... ‘సాలు దొర... సెలవు దొర’

హైదరాబాద్ (Hyderabad): బీజేపీ (Bjp) జాతీయ కార్యవర్గ సమావేశాలకు తెలంగాణ (Telangana)ను ఎంచుకోవడం... ప్రధాని మోదీ (Pm Modi) హైదరాబాద్ రావడం అంతా తెలంగాణ ప్రజల మనోభావాలకు అనుగుణంగానే జరుగుతోందని బీజేపీ నాయకురాలు విజయశాంతి (Vijayashanti) అన్నారు. నమ్మి ఓట్లేసిన ప్రజల విశ్వాసాన్ని వమ్ము చేసిన అధికార టీఆరెస్ (Trs) పార్టీని ఎప్పుడెప్పుడు వదిలించుకుందామా? అని రాష్ట్ర ప్రజానీకం ఎదురుచూస్తోందన్నారు. తెలంగాణలో రైతులు, నిరుద్యోగుల ఆత్మహత్యలు... నిరసనలు కొనసాగుతున్న తీరు, దుబ్బాక (Dubbaka), హుజురాబాద్‌ (Huzurabad)లో కాషాయం రెపరెపలను బట్టి... ప్రజలే కేసీఆర్‌ని ‘సాలు దొర... సెలవు దొర‘ అంటున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదని ఆమె తెలిపారు. 


‘‘ప్రజల మనోభావాలనే బీజేపీ తెలంగాణ కార్యాలయం వద్ద బోర్డు రూపంలో ప్రతిబింబించడం జరిగింది. కేసీఆర్‌కి నిజంగా పౌరుషం ఉంటే... ప్రజల్లో తనపై ఉన్న ఈ ప్రతికూల భావాలను తొలగించుకునేలా పని చేయాలని గాని... పోటీగా "సాలు మోదీ... సంపకు మోదీ..." అంటూ పోస్టర్లు పెట్టించడం అలిగి ఏడ్చే చిన్నపిల్లల తీరుగా ఉంది. టీఆర్ఎస్ పార్టీని... ప్రభుత్వాన్ని మోడీ చంపనక్కర్లేదు. ఆ పని ప్రజలే చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది చాలక సరిగ్గా బీజేపీ జాతీయ సమావేశాలు జరుగుతున్నప్పుడే విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‎ని రప్పించి పోటీ బైక్ ర్యాలీ పెట్టించడం... ఇదంతా వాపును చూసి బలుపు అనుకోవడం తప్ప మరేం కాదు. ఇటీవలే జరిగిన పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాషాయం కళకళలాడింది. ప్రధాని మోదీ పని తీరుతో అంతర్జాతీయ స్థాయిలో భారత ప్రతిష్ట జగన్నాథ రథచక్రాల్లా పరుగులు తీస్తోంది. అందుకు భిన్నంగా తెలంగాణలో మాత్రం నిన్నగాక మొన్ననే రైతులకు బేడీలు తగిలించి మరీ లాక్కెళ్ళిన ఘటన మీడియాలో, సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. మరోపక్క పోడు భూముల కోసం నిరసనలకు దిగిన ఆదివాసీ ఆడపడుచుల వీపులు పగులగొట్టారు... ఇలాంటి దురదృష్టకర సంఘటనలు కేసీఆర్ హయాంలో సర్వసాధారణం అయిపోయాయి. అందుకే మళ్ళీ మళ్లీ చెబుతున్నాను... సాలు దొర... సెలవు దొర.’’ అని విజయశాంతి అన్నారు. 



Updated Date - 2022-07-02T23:29:30+05:30 IST