రాష్ట్రంలో Telangana బీసీ కమిషన్‌ పర్యటన

ABN , First Publish Date - 2022-05-25T17:00:10+05:30 IST

తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఈనెల 25 నుంచి రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ, జీవన ప్రమాణాల

రాష్ట్రంలో Telangana బీసీ కమిషన్‌ పర్యటన

బెంగళూరు: తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్‌ ఈనెల 25 నుంచి రాష్ట్రంలో మూడు రోజులపాటు పర్యటించనుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల శాతం స్థిరీకరణ, జీవన ప్రమాణాల మెరుగుదలకు తీసుకోవాల్సిన చర్యలు, చేయాల్సిన సిఫారసుల నిమిత్తం అధ్యయనం కొనసాగించనుంది. కమిషన్‌ చైర్మన్‌ డాక్టర్‌ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు సారథ్యంలో సభ్యులు సీహెచ్‌ ఉపేంద్ర, శుభప్రద్‌పటేల్‌నూలి, కే కిశోర్‌గౌడ బృందం కర్ణాటక బీసీ కమిషన్‌ చైర్మన్‌ జయప్రకాశ్‌ హెగ్డే, ఇతర సభ్యులతో సమావేశం కానుంది. వసంతనగర్‌లోని దేవరాజ్‌ అరసు భవనంలో భేటీ కానున్నారు. ఇది వరకు రాష్ట్రంలో బీసీ కమిషన్‌ చేపట్టిన కులగణన, అమలు చేసిన పద్ధతులు, విధి విధానాలపై కూలంకుషంగా చర్చిస్తారు. గురువారం బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీతోనూ, ఇతర ప్రముఖులతోనూ భేటీ కానున్నారు. శుక్రవారం బీసీ కమిషన్‌ మాజీ చైర్మన్‌ కాంతరాజ తదిరులతో సమావేశం కానున్నట్టు తెలంగాణ బీసీ కమిషన్‌ చైర్మన్‌ కార్యదర్శి నోముల శ్రీనివాసరావు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 

Updated Date - 2022-05-25T17:00:10+05:30 IST