బిసీ స్టడీ సర్కిల్స్ కొలువులకు నెలవులు

ABN , First Publish Date - 2021-12-02T21:30:09+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం బిసీ విద్యార్థుల అభ్యున్నతి కోసం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలని బిసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర పిలుపునిచ్చారు.

బిసీ స్టడీ సర్కిల్స్ కొలువులకు నెలవులు

హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం బిసీ విద్యార్థుల అభ్యున్నతి కోసం అందించే అవకాశాలు అందిపుచ్చుకోవాలని బిసీ కమిషన్ సభ్యులు సిహెచ్ ఉపేంద్ర పిలుపునిచ్చారు. ఉస్మానియా యునివర్సిటీ ఆరవణ లోని బిసి స్టడీ సర్కిల్ ను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో, సిబ్బందితో కలిసి మాట్లాడారు. బిసి స్టడీ సర్కిల్స్ ను సీఎం కేసీఆర్ పేద, బడుగు బలహీన వర్గాల వారికి ఉద్యోగ అవకాశాలు మెరుగుపరిచే శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాటు చేశారని ఆయన గుర్తుచేశారు. నాణ్యమైన విద్యను అందిస్తూ ప్రైవేటు సంస్థల్లో కోచింగ్ తీసుకోలేని వారికి  నిపుణులతో ఉచితంగా పోటీ పరీక్షలకు కోచింగ్  అందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కే దక్కిందన్నారు. 


తెలంగాణ బీసీ స్టడీ సర్కిల్లో  శిక్షణ పొందిన 1988 మంది విద్యార్థులకు ప్రభుత్వ వివిధ శాఖలలో ఉద్యోగాలు రావడంతో బిసి స్టడీ సర్కిల్ కొలువులకు నెలవుగా మారిందని ఆయన ప్రశంసించారు.కరోనా సమయంలో కూడా ఆన్ లైన్ ద్వారా విద్యను అందించిన బోధనా సిబ్బంది, బిసి స్టడీ సర్కిల్ అధికారులను ఆయన అభినందించారు. ముఖ్యమంత్రి ఆశయాల సాధన కొరకు అధికారులంతా కలిసి పని చేయాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ ప్రాంతంలో కేవలం 19 గురుకులాలు ఉంటే నేడు రాష్ట్ర ముఖ్యమంత్రి  చొరవతో  బీసీల అభ్యున్నతి కొరకు 238 గురుకులాలు ఏర్పాటు చేశారన్నారు.  


నాణ్యమైన విద్యను అందిస్తూ ఒక్కొక్క విద్యార్థిపై లక్షా 25 వేల రూపాయలు ఖర్చు చేస్తున్న రాష్ట్రం దేశంలో తెలంగాణ మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.   బడుగు, బలహీన వర్గాలు  ప్రభుత్వం అందిస్తున్న విద్యా అవకాశాలను సద్వినియోగం చేసుకుని విద్యతోనే సామాజిక సమానత్వం ఆర్థిక అభివృద్ధి సాధించాలని ఉపేంద్ర పిలుపునిచ్చారు.తెలంగాణలో బిసీ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తూ,విదేశీ ఉన్నత చదువుల కొరకు వెళ్లేవారికి మహాత్మ జ్యోతిబా పూలే ఓవర్ సిస్ విద్యా పథకం ద్వారా ఒక్కొక్క విద్యార్థికి 20 లక్షల రూపాయలు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. 

         


Updated Date - 2021-12-02T21:30:09+05:30 IST