ఎంబీసీ కార్పొరేషన్ తో చిన్నకులాలకు చేయూత : బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర

ABN , First Publish Date - 2022-03-20T01:26:25+05:30 IST

తెలంగాణలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా అందరికీ విద్యను అందించాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన కొనసాగుతుందని తెలంగాణ బిసి కమిషన్ సభ్యులు ఉపేంద్ర అన్నారు.

ఎంబీసీ కార్పొరేషన్ తో చిన్నకులాలకు చేయూత : బీసీ కమిషన్ సభ్యులు ఉపేంద్ర

హైదరాబాద్: తెలంగాణలో మహాత్మా జ్యోతిరావు పూలే ఆశయాలకు అనుగుణంగా అందరికీ  విద్యను అందించాలనే దృక్పథంతో ముఖ్యమంత్రి కేసిఆర్ పాలన కొనసాగుతుందని తెలంగాణ బిసి కమిషన్ సభ్యులు ఉపేంద్ర అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఎంబీసీలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి ఎంబీసీల డెవలప్మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేసి చిన్న కులాలను,అత్యంత వెనుకబడిన కులాలను  ప్రోత్సహించేందుకు కృషి చేస్తున్నారని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు.బీసీ విద్యార్థుల చదువుకొరకు అనేక గురుకుల పాఠశాలను ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య, నాణ్యమైన ఆహారాన్ని కల్పిస్తున్నారని ఆయన అన్నారు. 


గురుకుల పాఠశాలల్లో సీట్లు పొందడం కోసం ఎంబీసీ విద్యార్ధులకు పరీక్ష లేకుండానే ప్రత్యేక కోటాలో  నేరుగా అడ్మిషన్లు కల్పించాలని అనేక కుల సంఘాలు విజ్ఞప్తి చేశారు. వాటిని పరిశీలించిన ముఖ్యమంత్రి బిసి విద్యార్థులకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ఈ అవకాశాన్ని ఎంబీసీ కులాల నాయకులు, విద్యావంతులు గ్రామీణ పేద బీసీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రతిఒక్కరూ తమ కుల, రాష్ట్ర, జిల్లా ,మండల స్థాయి నాయకుల ద్వారా ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు.ఈ అవకాశాన్ని సంచార జాతుల తోపాటు ఇతర కుల సంఘం నాయకులు పేదవారికి విద్యను అందే విధంగా కృషి చేయాలని అన్నారు.

Updated Date - 2022-03-20T01:26:25+05:30 IST