Abn logo
Jul 25 2021 @ 17:33PM

ఈ నెల 28న అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

హైదరాబాద్‌: తెలంగాణ అసెంబ్లీ అష్యూరెన్స్‌ (హామీల) కమిటీ సమావేశం ఈనెల 28న జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీలోని కమిటీ హాల్‌లో ఈ సమావేశం జరుగుతంది. ఈ మేరకు మహిళా శిశుసంక్షేమశాఖ, దివ్యాంగులు, సీనీయర్‌ సిటీజన్స్‌కు సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన హామీలు, వాటి అమలు తీరును సమావేశంలో చర్చించనున్నారు. అలాగే ఈ నెల 29వ తేదీన అసెంబ్లీ పబ్లిక్‌అండర్‌ టేకింగ్స్‌ కమిటీ సమావేశం ఉంటుంది. ఉదయం 11.30గంటలకు అసెంబ్లీ కమిటీ హాలులో జరిగే సమావేశంలో వివిధ శాఖల్లోని పద్దులు, 2016-17కు సంబంధఙంచి కాగ్‌ నివేదిక, తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ, దాని పనితీరును ఈ సమావేశంలో చర్చింనున్నారు.

క్రైమ్ మరిన్ని...