ఈ నెల 17న తెలంగాణ అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

ABN , First Publish Date - 2022-05-12T21:57:51+05:30 IST

తెలంగాణ అసెంబ్లీ (telangana assembly) హామీల(assurances) కమిటీ సమావేశం ఈనెల 17వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు

ఈ నెల 17న తెలంగాణ అసెంబ్లీ హామీల కమిటీ సమావేశం

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ (telangana assembly) హామీల(assurances) కమిటీ సమావేశం ఈనెల 17వ తేదీన జరుగుతుందని అసెంబ్లీ కార్యదర్శి నరసింహాచార్యులు ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11గంటలకు అసెంబ్లీలోని కమిటీహాల్ లో ఈ సమావేశం జరుగుతుందన్నారు. ఈ సందర్భంగా మున్సిపల్ అడ్మినిస్ర్టేషన్, అర్బన్ డెవలప్ మెంట్ డిపార్ట్ మెంట్ శాఖ తరపున ప్రభుత్వం ఇచ్చిన హామీల అమతు తీరుపై ఈ సమావేశంలో చర్చ జరగుతుందని అసెంబ్లీ కార్యదర్శి వెల్లడించారు. 


Read more