నగరంలో రోజూ లక్ష టీకాలు

ABN , First Publish Date - 2021-01-19T07:12:29+05:30 IST

కరోనా వ్యాక్సిన్‌పై అపోహాలు తొలగించి ప్రజల్లో ధైర్యాన్ని నింపాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ వైద్యాధికారులకు సూచించారు.

నగరంలో రోజూ లక్ష టీకాలు
మాట్లాడుతున్న మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌,డిప్యూటీ సీఎం మహమూద్‌ అలీ, కలెక్టర్‌ తదితరులు

త్వరలో.. వెయ్యి సెంటర్లలో.. మంత్రి తలసాని ప్రకటన

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): కరోనా వ్యాక్సిన్‌పై అపోహాలు తొలగించి ప్రజల్లో ధైర్యాన్ని నింపాలని మంత్రి తలసాని శ్రీనివా్‌సయాదవ్‌ వైద్యాధికారులకు సూచించారు. జిల్లాలో పంపి ణీ చేస్తున్న కరోనా టీకాపై సోమవారం కలెక్టరేట్‌లో డీఐఓలు, ఎస్‌పీహెచ్‌ఓలు, తహసీల్దార్లతో మంత్రి తలసాని, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ సమీక్ష నిర్వహించారు. త్వరలో నగరంలో వెయ్యి సెంటర్లలో రోజూ లక్ష మందికి టీకాలు వేసే విధంగా చర్యలు తీసుకుంటామని తలసాని తెలిపారు. పోలీసుల సహకారంతో టీకా పంపిణీ కేంద్రాల వద్ద రద్దీని నియంత్రించాలని హోం మంత్రి మహమూద్‌ అలీ పేర్కొన్నారు. సమీక్షలో కలెక్టర్‌ శ్వేతామహంతి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ లోకే్‌షకుమార్‌, అడిషనల్‌ కమిషనర్‌ సంతో్‌షకుమార్‌, హైదరాబాద్‌ సీపీ అంజనీకుమార్‌, డీఎంహెచ్‌ఓ వెంకటి, తదితరులు పాల్గొన్నారు.  

 2,306 మందికి టీకాలు

హైదరాబాద్‌ సిటీ, జనవరి 18 (ఆంధ్రజ్యోతి): గ్రేటర్‌ హైదరాబాద్‌లో రెండో రోజు సోమవారం వ్యాక్సిన్‌ ఇచ్చే ప్రక్రియ ప్రశాంతంగా జరిగింది. 3,800 మంది లక్ష్యం కాగా, సోమవారం 2,306 మందికి టీకాలు వేశారు. దాదాపు 1,494 మంది టీకా వేసుకోలేదు.  

Updated Date - 2021-01-19T07:12:29+05:30 IST